ఈ ఏడాది ఎంపీల ఖర్చు ఎంత?

Update: 2015-12-26 07:36 GMT
    ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే చాలు విలాసాలకు, విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. మరీ ముఖ్యంగా ఎంపీలు చేసే ఖర్చులు ఎంతో వివాదాస్పదమవుతోంది. ఎంపీలు ప్రయాణ ఖర్చులే కోట్లు దాటేస్తున్నాయి. 2013-14లో మన ఎంపీలు ప్రయాణ ఖర్చుల కోసం ఏకంగా 147.38 కోట్లు ఖర్చు చేశారట.... ఈ తరువాత ఏడాది అంటే 2014-15లో 135.8 కోట్లు ఖర్చు చేశారట. అయితే.... ఈ ఖర్చు కేవలం ఇండియాలో తిరగడానికి చేసిన ఖర్చు మాత్రమే. విదేశీ ఖర్చుల లెక్క వేరు. అది దీని కంటే చాలా ఎక్కువ. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి వేద ప్రకాశ్ అనే వ్యక్తి వేసిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.
   
ప్రస్తుతం దేశంలో ఎంపీల వేతనం నెలకు రూ.50 వేలు... ఇది రెట్టింపు కానుంది. పైగా అనేక బిల్లులు వారికి ఉచితం, వివిధ అలవెన్సులూ ఉంటాయి. ఇక ప్రయాణ ఖర్చులకైతే అడ్డే ఉండడం లేదు. దేశీయ ప్రయాణాలకే సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తుంటే విదేశీ ప్రయాణాలకు ఇంకెంత ఖర్చు చేస్తున్నారో మరి. గత రెండేళ్లలో ఎంపీల ఖర్చు ఏడాదికి సుమారు రూ.150 కోట్లు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది అంతకంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు.
Tags:    

Similar News