ఐపీఎల్ సన్నాహాకాలు జోరందుకున్నాయి. అన్ని జట్లు ఇప్పటికే తమ సొంత పట్టణాలకు చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అందరికంటే ముందే ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం ఐసోలేషన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
గత ఏ డాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ కు ముందు కూడా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ నడిపింది.ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ కావడంతో అక్కడ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్స్ , అప్ డేట్స్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనిని మన తెలుగు క్రికెటర్ క్లీన్ బోర్డు చేశాడు. ఐపీఎల్ ప్రాక్టీసులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున వేలంలో కొన్న కడప యువ క్రికెటర్ హరిశంకర్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. బుధవారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జట్టులోకి కొత్తగా వచ్చిన యువ ఆంధ్రా ఫాస్ట్ బౌలర్ హరిశంకర్ రెడ్డి అద్భుతమైన రీతిలో బంతి విసరడంతో ఎంఎస్ ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ 22 ఏళ్ల కుర్రాడు 2018 నుంచి ఆంధ్రా జట్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు చెన్నై తరుఫున తన బౌలింగ్ తో సత్తా చాటుతున్నాడు.తాజాగా చెన్నై జట్టు హరిశంకర్ ఏకంగా ధోనిని ఔట్ చేసిన వీడియోను షేర్ చేసింది. కడపలో డిగ్రీ చేసిన హరిశంకర్ ను ఇటీవలే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.20లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది.