వివాదాలకు దూరంగా.. తన ఆట తాను ఆడుకునే మిస్టర్ కూల్ , టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డారు. ఆమ్రాపాలి అనే ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ గ్రూపునకు ధోని ప్రచార కర్తగా వ్యవహరించాడు. ఈ సంస్థ ఫ్లాట్ లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు వసూలు చేసింది. ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించడంతో వారంతా పెద్ద మొత్తంలో ఫ్లాట్ లకు అడ్వాన్సులు ఇచ్చారు. కోట్ల సొమ్ములు సేకరించిన ఆ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అనే కంపెనీలకు ఆ సొమ్మును మళ్లించింది.అయితే మళ్లించిన సంస్థల్లో మహేంద్ర సింగ్ ధోని భార్య కంపెనీ కూడా ఉంది.
అయితే తాజాగా డిపాజిట్లు తీసుకున్న అమ్రాపాలి గ్రూప్ కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కట్టిన లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్ప జెప్పలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2017లో ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అమ్రాపాలి రియల్ ఎస్టేట్ కంపెనీ మోసాలు చేసినట్టు తేలింది. ఇప్పటికే అమ్రాపాలి డైరెక్టర్లను సుప్రీం కోర్టు జైలుకు పంపింది.
కాగా ఇప్పుడు ఈ అమ్రాపాలి గ్రూప్ స్కామ్ మహేంద్ర సింగ్ ధోని మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది. కుట్రలో అతడికి భాగస్వామ్యం ఉందని.. అమ్రాపాలి గ్రూప్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధోనిపై నమ్మకంతోనే తాము ఫ్లాట్లు కొనుగోలు చేసి సొమ్ములు కట్టామని.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మోడీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఈ సంస్థపై తీర్పు తర్వాత ధోనిపై పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ధోని చిక్కుల్లో పడడం ఖాయంగా కనిపిస్తోంది.