ఆంధ్రజ్యోతిపై ఊహించనిరీతిలో అసహనం వ్యక్తం చేసిన ముద్రగడ

Update: 2019-11-06 11:58 GMT
ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా తమకు నచ్చని మీడియా సంస్థకు చెందిన పేపర్ ను.. చానల్ ను చూడనని చెప్పటం మామూలే. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

తానిక ఆంధ్రజ్యోతి పేపర్ ను చూడనని.. ఏబీఎన్ ఛానల్ ను చూడనని తేల్చేసిన ముద్రగడ.. మరో విషయాన్ని చెప్పారు. తాను ఎలా అయితే చూడనో.. తనకు సంబంధించిన వార్తల్ని ప్రింట్ మీడియాలోనూ.. టీవీ చానల్ లోనూ ప్రసారం చేయొద్దంటూ కోరారు. ఇప్పటివరకూ మరే రాజకీయ నేత కూడా ఈ తీరులో ఒక మీడియా సంస్థను తన వార్తల్ని పబ్లిష్ చేయొద్దని కోరింది లేదు.

సాధారణంగా కొన్ని మీడియా సంస్థలు తమకు అనుగుణంగా కొంతమంది రాజకీయ ప్రముఖుల్ని.. సినిమా సెలబ్రిటీలను తమకు తాముగా బ్యాన్ చేస్తుంటాయి. వారికి సంబంధించిన వార్తల్ని అస్సలు కవర్ చేయవు. అంతేకానీ.. ఏ ప్రముఖుడు కోరని విధంగా.. ముద్రగడ కోరిక ఉందని చెప్పాలి.

ఇంతకీ ముద్రగడకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఇంత తీవ్రమైన వ్యాఖ్య ఎందుకు చేశారు? అన్నది చూస్తే.. తాజాగా ఇసుక కొరత నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తాను ఇచ్చిన సలహాను ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తానురాసిన లేఖను ముక్కలు ముక్కలు చేసి.. ముఖ్యమైన సలహాను  రాయకుండా దాచేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చేతిలోపెన్ను. . కాగితాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం సరికాదన్నారు. ఇకపై తాను ఆంధ్రజ్యోతి పేపర్ చదవనని.. ఏబీఎన్ చానల్ ను చూడనని చెప్పిన ముద్రగడ.. అందుకు తగ్గట్లే.. తనకు సంబంధించిన వార్తల్ని కవర్ చేయొద్దని కోరారు. దీనికి సంబంధించి తాజాగా ఒక లేఖను సదరు మీడియా సంస్థ అధినేత ఆర్కేకు ముద్రగడ ఒక లేఖ రాశారు. మరీ వ్యవహారంపై ఆర్కే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News