బాబు ఎత్తుగ‌డ‌ను బ‌య‌ట‌పెట్టిన ముద్ర‌గ‌డ‌

Update: 2018-08-17 16:18 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి ఫైర్ అయ్యారు. తమ జాతికి ఇస్తామన్న రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆయన మరోసారి పట్టు బడుతున్నారు. ఇంతుకు మందు కాపుల రిజర్వేషన్ల అంశంపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాటమార్చారన్న ముద్రగడ పద్మనాభం ఈపారి ఆయనే మాట మార్చడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం శుక్రవారం నాడు తాజాగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో తహశీల్దారులతో పాటు మరికొన్ని కీలక ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ పోస్టులను భర్తీ చేసే ముందు కాపు  రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. శుక్రవారం నాడు ముద్రగడ పద్మనాభం ఈ మేరకు డిమాండ్ చేశారు. కాపులను బీసీ -  ఎఫ్‌ లో చేరుస్తామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని - దీనికిపై కేంద్రానికి విన్నవించామని కూడా అన్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ వచ్చే సరికి ఆయన కేంద్రంపై నెపాన్ని గెట్టివేస్తామనడం దారుణమని ముద్రగడ ఫైర్ అయ్యారు..

 వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందుగా రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోవి అని ప్రకటించారు, దీనిపై వాస్తవాలు తెలిసినా ముద్రగడ మాత్రం ఆ ప్రకటనను తప్పుపట్టారు. జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ నానా యాగీ చేశారు. అయితే, ఇందులో వాస్తవాలను గుర్తించిన కాపు యువత, మేథావులు మాత్రం జగన్ చెప్పిందే కరెక్టే అని తీర్మానించారు. దీంతో ఇప్పుడు ముద్రగడ డిఫెన్స్‌ లో పడ్డారు. తమకు చంద్రబాబు నాయుడి ద్వారా లబ్ది చేకూరదని తెలుసుకున్న ముద్రగడ మళ్లీ తానే యూటర్న్ తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయంలో కాపులకు రిజర్వేషన్ అంశం కీలకంగా మారనుంది. ఇప్పటికే అనేక సార్లు కాపులను వంచించారనే అపవాదు చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్నారు. కాపు యువత కూడా రిజర్వేషన్లపై సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే పనిలో పడింది.  ఈసారి ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లపై తేల్చాలని - లేని పక్షంలో తాము జగన్ వైపు అడుగులు వేస్తామని కాపుల్లో ఎక్కువ మంది చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా అల్టిమేటం జారీ చేయడంతో నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి ఇరకాటంలో పడినట్లు అయ్యిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News