ముద్రగడ ఇప్పుడెలా ఉన్నారు? డాక్టర్లతో ఏమన్నారు?

Update: 2016-06-12 11:29 GMT
తుని ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్ని విడుదల చేయాలని.. ఆ విధ్వంసకాండ మీద ఎలాంటి అరెస్ట్ లు ఉండకూడదంటూ కాపునేత ముద్రగడ పద్మనాభం గడిచిన నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి బలవంతంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. ఆయనకు వైద్యం చేయటానికి మాత్రం ససేమిరా అంటున్నారు.

తన దగ్గరకు డాక్టర్లు రాకుండా మొండికేస్తున్న ముద్రగడ తాజా పరిస్థితి ఎలా ఉంది? ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ల విషయంలో ఆయన ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూస్తే..

ఇప్పటికి ముద్రగడ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆయన నిరశనను స్వస్తి పలకాలని.. వైద్యానికి అంగీకరించాలంటూ వైద్యులు చేస్తున్న వినతిని ఆయన పట్టించుకోవటం లేదు. నీరసంగా ఉన్న ఆయన.. నిలుచొనే మాట్లాడుతున్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోతే పిలుస్తానని.. అప్పుడు వైద్యంచేయాలంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడ సతీమణికి.. ఆయన కోడలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారికి సెలైన్లు ఎక్కించినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజా పరిస్థితుల్ని చూస్తుంటే.. ఈ రోజైనా ముద్రగడకు వైద్యులు బలవంతంగా అయినా ప్లూయిడ్స్ ఎక్కిస్తారా? అన్నది సందేహంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News