పాపం.. పాదయాత్ర చేయాలని ఎంతగానో తపిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని కాలు కదపనివ్వకుండా చేస్తున్నారు చంద్రబాబు. కాపులను బాగా ప్రభావితం చేయగలిగే ముద్రగడ నీడ కూడా నంద్యాలపై పడకూడదని ఆయన ఎంతగా అనుకుంటున్నప్పటికీ ఆయన మాత్రం తన వపర్ ఫుల్ డైలాగులతో తెలుగు దేశం పార్టీని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. నంద్యాలలో ఉన్న బలిజ ఓటర్లను ప్రభావితం చేసేలా ముద్రగడ మరోసారి గొంతు విప్పారు. నంద్యాలలో ఎవరిన ఓడించాలో కాపులకు తెలుసని ఆయన అన్నారు. పనిలో పనిగా చంద్రబాబు కాపులకు చేస్తున్న అన్యాయాలను ఏకరువు పెట్టారు. దీంతో... ఎవరికి ఓటేయాలో... ఎవరికి వేయొద్దో చెప్పకనే చెప్పేశారు.
మూడు రోజుల కిందట విజయవాడలో కాపులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పెద్ద క్యాబేజీ తెచ్చి కాపుల చెవిలో పెట్టారని... విజయవాడ సమావేశంలో చంద్రబాబు ఏదైనా శుభవార్త చెబుతారని తాను సైతం ఆశించినా ఆయన మళ్లీ మోసం చేశారని ముద్రగడ మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోలేని స్థితిలో మా కాపు జాతి లేదని... ఎవరిని ఓడించాలో కాపులకు తెలుసని అన్నారు.
ముద్రగడ తాజా వ్యాఖ్యలతో టీడీపీ శిబిరంలో మళ్లీ అలజడి మొదలైంది. నంద్యాల బలిజ ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా ముద్రగడ వ్యాఖ్యలు చేశారని.. అవి తమకు నష్టం కలిగించడం ఖాయమని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు.