డొనాల్డ్ ట్రంప్ అందుకోబోయే జీతం ఎంతో తెలుసా?

అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-20 14:30 GMT

అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అసలు అమెరికా అధ్యక్షుడికి జీతభత్యాలు ఎలా ఉంటాయి..? ప్రపంచంలో అందరు దేశానిధినేతలకంటే అగ్రరాజ్యం అధినేతకే ఎక్కువ జీతం ఉంటుందా మొదలైన చర్చ తెరపైకి వచ్చింది.

అవును.. కాసేపట్లో అగ్రరాజ్యం అమెరికా అధినేతగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అందుకునే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ అందుకునే వేతనం ఏడాదికి 4 లక్షల డాలర్లు.

అంటే... భారతీయ కరెన్సీలో రూ.3.46 కోట్ల గౌరవ వేతనం అన్నమాట. అంటే.. ప్రతీ నెలా సుమారు రూ.30 లక్షల వేతనం ట్రంప్ కు అందుతుంది. 2021 నుంచి ఇదే అమౌంట్ ని అమెరికా అధ్యక్షుడికి వేతనంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కి కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అమెరికా అనేది ప్రపంచానికి పెద్దన్న కావొచ్చు, అగ్రరాజ్యంగా పిలుచుకోవచ్చు కానీ... దేశాధినేత విషయంలో మాత్రం ఇది తక్కువే అని అంటున్నారూ. ఎందుకంటే... సింగపూర్ ప్రధానమంత్రి వార్షిక వేతనం రూ.13.85 కోట్లుగా ఉండగా.. హాంకాంగ్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వేతనం రూ.6 కోట్లు!

ఇదే సమయంలో... స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ యాన్యువల్ శాలరీ రూ.4.93 కోట్లు కాగా.. ఆస్ట్రేలియా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.57 కోట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో... అమెరికా అధ్యక్షుడికి వేతనంతో పాటు అందే అదనపు సౌకర్యాలు, సౌలభ్యాలు చాలానే ఉంటాయి!

ఇందులో భాగంగా... వ్యక్తిగత, ఆఫీసు విధుల భత్యంగా రూ.43 లక్షలు.. ప్రయాణ ఖర్చుల కోసం రూ.86 లక్షలు.. వినోద భత్యంగా రూ.16 లక్షలు.. వైట్ హౌస్ డెకరేషన్ ఖర్చుల కోసం రూ.86 లక్షలను ఏటా అమెరికా అధ్యక్షుడికి ఇస్తారు. ఇలా వార్షిక వేతనానికి ఇవన్నీ కలుపుకుంటే మొతం సుమారు.4.92 కోట్ల వరకూ అందుతాయన్నామాట.

ఇదే సమయంలో.. ప్రెసిడెంట్ కి వసతి సౌకర్యాలతో పాటు ఎయిర్ ఫోర్స్ వన్ విమాన సర్వీసు, సాయుధ లగ్జరీ కారు, మెరైన్ వన్ సర్వీసును అందిస్తారు. దీనితో పాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ రక్షణ లభిస్తుంది. మెడికల్ ఖర్చులనూ ప్రభుత్వమే భరిస్తుంది. పదవీకాలం పూర్తైన తర్వాత సుమారు రూ.2 కోట్ల పెన్షన్, ఉచిత వైద్యం అందిస్తారు.

Tags:    

Similar News