లిక్కర్ లవర్స్ కి నోరూరించే న్యూస్

అయితే ప్రభుత్వంతో చర్చలు జరపడంతో మళ్లీ యథావిధిగా బీర్లు సరఫరా చేస్తామని తాజాగా ప్రకటించింది.

Update: 2025-01-20 14:47 GMT

తెలంగాణలో లిక్కర్ లవర్సుకి నోరూరించే వార్త చెప్పింది యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ. కింగ్ ఫిషర్, హెన్ కిన్ బీర్లను సరఫరా చేసే ఈ కంపెనీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో తమ కంపెనీ బీర్లు పంపిణీ చేయమని కొద్ది రోజుల క్రితం ప్రకటించి మందుబాబులకు షాకిచ్చింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరపడంతో మళ్లీ యథావిధిగా బీర్లు సరఫరా చేస్తామని తాజాగా ప్రకటించింది.

యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ ప్రకటనతో ఇటు మందుబాబులు, అటు కంపెనీ ఉద్యోగులు, కార్మికులు కూడా ఖుషీ అవుతున్నారు. కింగ్ ఫిషర్ బీర్లకు తెలంగాణ పెద్ద మార్కెట్. అయితే తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కోట్ల రుపాయల బకాయి పెట్టడంతో తాత్కాలికంగా బీర్లు సరఫరా నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఆ చర్చల్లో బకాయిలు చెల్లిస్తామని బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు హామీ ఇవ్వడంతో మళ్లీ బీర్ల సరఫరా పునరుద్ధరించేందుకు యునైటెడ్ బ్రేవరీస్ ఓకే చెప్పింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.

తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరిగిన అనంతరం బీర్ల ధర పెంపు, బకాయిల చెల్లింపుపై అవగాహన కుదిరిందని యునైటెడ్ బ్రేవరీస్ తెలిపింది. కష్టమర్లు, కార్మికులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వెనక్కి తగ్గనట్లు చెప్పుకొచ్చింది. కాగా, బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ ప్రకటన చేయగానే ఆ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూటును తాకాయి. షేర్ ధర రాకెట్ లా దూసుకుపోయింది.

Tags:    

Similar News