కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. తిరిగి రాజకీయాల్లోకి రానున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ క్రమం లో ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సోము తెలిపారు. అయితే.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుం టానని ముద్రగడ చుప్పారు. అయితే.. ముద్రగడ రాజకీయాల్లోకి వచ్చేది లేదని.. ఆయన ఇప్పటికే కాపు ఉద్యమం నుంచి తప్పుకొన్నారని.. కొందరు విశ్లేషణలు చేశారు.
పైగా ఇప్పుడున్న రాజకీయాలకు ముద్రగడ వైఖరికి సరిపోయే పరిస్థితి కూడా లేదని అందరూ అనుకు న్నారు. దీంతో సోము చర్చలు ఫలించే అవకాశం లేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అయితే.. అనూ హ్యంగా ముద్రగడ వడివడిగా అడుగులు వేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీసీ నేతలు భారీ సంఖ్యలో తరలి రావడం గమనార్హం. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీసీల సమస్యలతోపాటు కాపు రిజర్వేషన్ విషయాన్ని కూడా వారితో చర్చించారు. ము ఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే విషయంపై ప్రధానంగా చర్చిం చినట్టు తెలిసింది. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఆహ్వానం అందినా.. ముద్రగడ స్పందించ లేదు. పైగా కాపులకు రిజర్వేషన్ విషయంలో తన పాత్రలేదన్న జగన్‌పై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తర్వాత పరిణామాల్లోకాపు ఉద్యమం నుంచి తప్పుకొన్నారు.
మళ్లీ చాన్నాళ్ల తర్వాత.. సోము వీర్రాజు భేటీ, ఆహ్వానంతో ముద్రగడ విషయం చర్చకు వచ్చింది. కాపు సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడిగా.. వివాద రహిత నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ రాజకీయంగా వస్తే.. బాగానే ఉంటుందనే అభిప్రాయం బీజేపీలో ఉంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఏమేరకు సక్సెస్ అవుతారు? అనేది మాత్రం చర్చనీయాంశం. ప్రస్తుతం జరిగిన చర్చలో ఇతమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోయినా.. బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.