కేసీఆర్ కేబినెట్ ఇప్పుడే.. కేటీఆర్ డౌటే

Update: 2018-12-26 07:04 GMT
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ బంపర్ మెజార్టీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెల్సిందే. కాగా డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్-మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం స్వీకారం చేసి దాదాపు పక్షం రోజులు కావస్తున్నా నూతన క్యాబినెట్ విస్తరణ నోచుకోలేదు. కాగా తాజాగా అందిన సమాచారం మేరకు అతి త్వరలోనే కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప్రస్తుతం మహమూద్ అలీ ఉన్నారు. కాగా మరో 16మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. కేసీఆర్ - కేటీఆర్ లు ముందు నుంచి పార్టీకి వినయ విధేయులకే ఈసారి పదవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే  ఆ వినయ విధేయులు ఎవరు.. ఎవరికీ క్యాబినెట్ లో అవకాశం దక్కుతుందని ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతుంది.

ఈనెల 30న కేసీఆర్ తన క్యాబినెట్ విస్తరణ యోచినట్లు సమాచారం. దీంతో కిందటిసారి క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో పెద్దఎత్తున విమర్శల పాలయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి మహిళలకు రెండు కీలకమైన శాఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వినికిడి. మహిళకు స్పీకర్ పదవీ ఇవ్వాలా లేదా మంత్రి పదవీ ఇవ్వాలని దానిపై కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా ఓడిపోయిన సీనియర్లు - కీలక నేతలకు ఈసారి క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు లేవని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఈసారి క్యాబినెట్ విస్తరణ కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాలనపై ఏమాత్రం ప్రభావం పడకుండా జాగ్రత్తగా కూర్పు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ కు ఈసారి క్యాబినెట్ అవకాశం లేదని వాదన గట్టిగా వినిపిస్తోంది. కేటీఆర్ ను పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు - లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమయాత్తం చేయడానికి ఉపయోగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే కేటీఆర్ కు ఆటూ పార్టీలో - ఇటూ పాలనలో నిరూపించుకోనే అవకాశం ఇవ్వాలని పార్టీలోని కొందరు ముఖ్యులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి మరీ.
Tags:    

Similar News