గడిచిన కొంతకాలంగా ఆసియాలోనే అత్యంత సంపన్నుడన్న టైటిల్ ను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కమ్ ఎండీ ముకేశ్ అంబానీకి.. ఈ మధ్యనే ఆ కిర్తీ కిరీటం చేజారిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా స్వల్ప వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన మరో భారత పారిశ్రామిక కెరటం అదానీ సంస్థల గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కారణంగా ఆయన రెండోస్థానానికి వెళ్లాల్సి వచ్చింది. గడిచిన వారంలో రిలయన్స్ షేర్లు దూసుకెళ్లటం.. అదానీ షేర్లు వెనకడుగు వేయటంతో మరోసారి ఆయన ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం అంబానీ నికర (నెట్) సంపద 99.7 బిలియన్ డాలర్లుగా తేల్చారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.7.67 లక్షల కోట్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఆయనది ఎనిమిదో స్థానం. అదానీ సంస్థల షేర్లు కాస్త వెనకడుగు వేయటంతో గౌతమ్ అదానీ వెనక పడ్డారు. ఇప్పుడాయన ఆసియాలో రెండో స్థానంలో నిలిచారు. అయితే.. ముకేశ్ అంబానీకి.. గౌతమ్ అదానీకి మధ్యనున్న వ్యత్యాసం చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా ఆయన నికర సంపద 98.7 బిలియన్ డార్లుగా ఉంది. అంటే.. ఒక బిలియన్ డాలర్లే ఇద్దరి మధ్య వ్యత్యాసంగా చెప్పాలి.
తాజా లెక్కల ప్రకారం ప్రపంచ టాప్ టెన్ కుబేరుల్లో ముకేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలవగా.. గౌతమ్ అదానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక మొదటి స్థానంలో ఎప్పటి మాదిరే ప్రపంచ కుబేరుడిగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. ఆయన నికర సంపద 227 బిలియన్ డాలర్లుగా తేల్చారు.
తర్వాతి స్థానంలో అమెజాన్ జెఫ్ బెజోస్ (149.4 బిలియన్ డార్లు) మూడో స్థానంలో ఎల్ వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ (138.3 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో బిల్ గేట్స్ (123.6 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో వారెన్ బఫెట్ (114.1 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో లారీ పేజ్ (106.4 బిలియన్ డాలర్లు).. ఏడో స్థానంలో సెర్గీ బ్రిన్ (101.9 బిలియన్ డాలర్లు).. ఎనిమిదో స్థానంలో ముకేశ్ అంబానీ (99.7 బిలియన్ డాలర్లు).. తొమ్మిదో స్థానంలో గౌతమ్ అదానీ (98.7 బిలియన్ డాలర్లు).. పదో స్థానంలో స్టీవ్ బామర్ (96.8 బిలియన్ డాలర్ల) నిలిచారు.
భారత సంపన్నుల జాబితాను చూస్తే..
మొదటి.. రెండో స్థానాల్లో ముకేశ్ అంబానీ.. గౌతమ్ అదానీలు నిలవగా..
మూడో స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ (28.7 బిలియన్ డాలర్లు)
నాలుగో స్థానంలో శివ్ నాడార్ (25.9 బిలియన్ డాలర్లు)
ఐదో స్థానంలో లక్ష్మీ మిత్తల్ (20.1 బిలియన్ డాలర్లు)
ఆరో స్థానంలో డి మార్ట్ రాధాకిషన్ దమానీ (19.6 బిలియన్ డాలర్లు)
ఏడో స్థానంలో ఉదయ్ కోటక్ (14.8 బిలియన్ డాలర్లు)
ఎనిమిదో స్థానంలో దిలీప్ సంఘ్వీ (14.5బిలియన్ డాలర్లు)
తొమ్మిదో స్థానంలో సైరస్ పూనా వాలా (14 బిలియన్ డాలర్లు)
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాను చూసినప్పుడు బ్లూమ్ బర్గ్ లెక్క వేసిన నికర సంపదతో పోలిస్తే.. ఫోర్బ్స్ వారి రియల్ టైం లో మరింత ఎక్కువగా ఉంది. ముకేశ్ అంబానీ సంపద 104.7 బిలియన్ డాలర్లు అయితే.. గౌతమ్ అదానీ నికర సంపద 99.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ ను పరిగణలోకి తీసుకుంటే ముకేశ్ అంబానీ ప్రపంచ ర్యాంకింగ్ లో ఏడో స్థానంలో నిలుస్తారు.