మొన్నటి దాకా అమ్మిన అంబానీ.. ఇప్పుడు కొంటున్నారేంటి?

Update: 2020-08-20 17:30 GMT
ఎప్పుడేం చేయాలో బాగా తెలిసిన కార్పొరేట్ దిగ్గజంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని చెప్పాలి. తనకు ఎదురుదెబ్బలు తగిలిన వ్యాపారంలోనూ.. ఓపిగ్గా ఎదురుచూడటం.. వెంటనే మరో రంగానికి షిఫ్ట్ అయి.. అక్కడ తన లక్ ను పరీక్షించుకోవటం లాంటి విషయాల్లో ముకేశ్ మహా మొనగాడు. ఏదైనా భారీగా చేయటం ద్వారా.. మార్కెట్ మీద పట్టు సాధించొచ్చన్న విషయాన్ని జియోతో నిరూపించారు.

కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ తన వ్యాపార చతురత ఎంతన్నవిషయాన్ని చేతల్లో చూపారు. జియో వాటాల్ని ప్రీమియం రేటుకు అమ్మేస్తూనే.. అలా అమ్మిన కంపెనీలన్ని ఆయా రంగాల్లో మొనగాళ్లనే ఎంచుకోవటం చూస్తే.. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత పక్కాగా ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు పద్నాలుగు దిగ్గజ కంపెనీలకు జియో వాటాల్నిఅమ్మటం తెలిసిందే. ఇవన్నీ టెక్నాలజీతో పాటు.. భవిష్యత్తులో రిలయన్స్ వేసే అడుగులకు సాయంగా నిలిచేవే కావటం గమనార్హం.

5జీ మీద కన్నేయటంతో పాటు.. ఆన్ లైన్ షాపింగ్ విషయంలోనూ ఇప్పటికే కన్నేసిన అంబానీ.. తాజాగా ఈ-కామర్స్ మీద ఫోకస్ చేసిన వైనం ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే అర్థం కాక మానదు. అమెజాన్ తో పోటీ పడేందుకు ఆయన డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. అలా అని ఇప్పటికిప్పుడు ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయటం అంత తేలికైన విషయం కాదన్నది గుర్తించిన ముకేశ్.. ఇప్పుడీ రంగంలో ప్రజల్లోకి వెళ్లిన కంపెనీల్ని కొనుగోలు చేయటం షురూ చేశారు.

అన్ లైన్ మెడిసిన్స్ ను విభాగాన్ని ఆమెజాన్ మొదలు పెట్టగానే.. ఈ రంగంలో ఇప్పటికే మంచిపేరున్న ‘‘నెట్ మెడ్స్’’ కంపెనీని కొనుగోలు చేశారు ముకేశ్. రిటైల్ మార్కెట్ లో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు వీలుగా.. ఫ్యూచర్ రిటైల్ విభాగంలో వాటాల కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాసరీ విభాగంలో మంచిపేరున్న జివామెల్ లోనూ వాటాల కొనుగోలు మీద ఫోకస్ పెట్టింది. ఇలా.. ఈ-కామర్స్ రంగంతో పాటు.. టిక్ టాక్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జియో వాటాల్ని అమ్మని రిలయన్స్.. తాజా కొనుగోళ్లతో తన పోర్ట్ ఫోలియోను మరింత శక్తివంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News