ముఖేష్ అంబానీకి 2020 ఒక విచిత్రమైన సంవత్సరం. అతను సంపద దిగజారిపోయిన ఏడాది ఇదే. అతను ప్రపంచంలో మరింత సంపన్నుడిగా ఎదిగిన ఏడాది ఇదే. తాజాగా విడుదలైన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ను అధిగమించారు. గురువారం నాటికి వారెన్ బఫ్ఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు కాగా, ముఖేష్ సంపద విలువ ఇప్పుడు 68.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పిలువబడే 89 ఏళ్ల బఫెట్ కు విరాళాలు ఇవ్వడం కొత్త కాదు. 2006 నుండి 37 బిలియన్ డాలర్లను విరాళాలుగా ఇచ్చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా... తాజా ఇండెక్స్ ప్రకారం 63 ఏళ్ల అంబానీ ఇప్పుడు ప్రపంచపు ధనవంతుల జాబితాలో ఎనిమిదవ వాడు. బఫ్ఫెట్ ది తొమ్మిదవ స్థానం.