40 బిలియన్ డాలర్ల సంపదతో ముకేష్ అంబానీ...భారతీయులలో అత్యంత సంపన్నుడిగా ఉన్న సంగతి తెలిసిందే. భారత అపర కుబేరుడిగా వెలుగొందుతోన్న ముకేష్....ప్రతి ఏడా మరింత ధనవంతుడిగా మారుతున్నారు. తన తండ్రి ధీరూ భాయ్ అంబానీ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న ముకేష్ ....వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తన దగ్గరున్న సంపదకు తగ్గట్లుగానే అంబానీ.....విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంబానీ ఉండే ఇంటి ధర దాదాపుగా 12000 కోట్లు. ప్రతిష్మాత్మక బకింగ్ హామ్ ప్యాలెస్ తర్వాత.... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ భవనం ఇదే. లగ్జరీ కార్లు - ప్రైవేట్ జెట్స్ - షిప్స్ ...ఇలా కోరినవన్నీ అంబానీ సొంతం. నీతా అంబానీ వాడే ఫోన్ ధర అక్షరాలా పాతిక కోట్లంటే విలాసానికి అంబానీ ఎంత ఖర్చుపెడతారో చెప్పవచ్చు. తాజాగా, అంబానీ....రూ.150 కోట్ల విలువైన నీటిపైన తేలియాడే భవనాన్ని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఫ్రాన్స్ కి చెందిన ప్రత్యేక షిప్ బిల్డింగ్ కంపెనీ వారు ఈ వాటర్ హౌస్ ను నిర్మించారు. షిప్ లాగే నీటి పై తేలియాడుతూ సకల సౌకర్యాలు...అన్ని హంగులతో ఈ భవనం ఉండడం విశేషం. ముంబై లోని బీచ్ క్యాండీ లో ఉన్న ఈ వాటర్ హౌస్ ...58 మీటర్ల పొడువు - 38 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ హౌస్ వైశాల్యం 36,000 వేల చేదరపు అడుగులు. 12 మంది ప్రయాణికులకు 20 మంది సిబ్బంది కి అన్ని రకాల ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ - సోలార్ ప్యానల్స్ అమర్చిన ఈ వాటర్ హౌస్ రోజుకు కనీసం 5000 కిలోవాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. గుర్రపు డెక్క ఆకారంలో ఉన్న ఈ వాటర్ హౌస్ కు సోలార్ ప్యానల్ అమర్చారు. 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ - ఒక మసాజ్ రూమ్ - ఒక మ్యూజిక్ రూమ్ - ఒక పెద్ద డైనింగ్ రూమ్ - ఒక థియేటర్ - ఒక టెర్రాస్ - ఒక లాంజ్ - లిఫ్ట్ ఉన్నాయి. కింది భాగంలో లాంచ్ పియానో బార్ - ఒక డైనింగ్ ఏరియా ఉన్నాయి. డైనింగ్ రూమ్ నుండి సముద్రం అందంగా కనిపించే ఈ ఇంటిలో అతిథుల కోసం 5 ప్రతేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. లాంచ్ రీడింగ్ రూమ్ - హెలిపాడ్ ఉన్నాయి.