ముకేశ్‌ అంబానీ... మైండ్ బ్లోయింగ్ రికార్డ్‌

Update: 2018-07-13 16:47 GMT
భారతీయ కుబేరుల్లో వరుసగా టాప్ ప్లేస్‌ లో నిలుస్తున్న రిల‌య‌న్స్ వ్యాపార దిగ్గ‌జం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ద‌ఫా  ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అదికూడా పొరుగుదేశ‌మైన  చైనాకు చెందిన బిలియనీర్ - అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మాను వెనక్కి నెట్టి శుక్రవారం రిలయెన్స్ లిమిటెడ్ షేరు ధర 1.6 శాతం పెరిగి 1099.8కి చేరడంతో ముకేశ్ సంపద కూడా భారీగా పెరిగింది. అంబానీ సంపద 4430 కోట్ల డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అదే సమయంలో జాక్ మా సంపద 4400 కోట్ల డాలర్లుగా ఉంది. పెట్రో కెమికల్స్ సామర్థ్యం రెండింతలవడంతోపాటు రిలయెన్స్ జియో దూసుకెళ్తుండటంతో ఈ ఏడాది అంబానీ సంపద 400 కోట్ల డాలర్లు పెరగడం విశేషం. అదే సమయంలో జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ 140 కోట్ల డాలర్లు నష్టపోయింది.

ఈ ఆగస్ట్‌లో జియో తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో ఇండియా ర్యాంకింగ్ త‌క్కువ‌గా ఉందన్న ముఖేశ్ రిలయన్స్ ఇండస్ట్రీలో కంపెనీ ఇప్పటివరకు 250 మిలియన్ డాలర్లు పెట్టుబ‌డి పెట్టినట్లు చెప్పారు. ఫైబర్ ఆధారిత బ్రాడ్‌ బ్యాండ్ సేవలను 1100 నగరాలకు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఇంటర్నెట్ మరింత వేగంగా వస్తుందన్నారు. వేగవంతమైన ఇంటర్నెట్‌తో బయటి నుంచే ఇంట్లో ఉన్న కంట్రోల్ స్విచ్‌ లను ఆపరేట్ చేయవచ్చు అని ఆయన తెలిపారు. దీన్నే జియో గిగా ఫైబర్‌గా పిలుస్తున్నట్లు ముఖేశ్ చెప్పారు. గత ఏడాది ముఖేశ్ కంపెనీ తన ఏజీఎం మీటింగ్‌లో రూ.1500 జియో ఫోన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. జియో గిగా ఫైబ‌ర్ కోసం ఆగ‌స్టు 15 నుంచి ఎన్‌ రోల్మెంట్ ఉంటుంద‌ని ముఖేశ్ తెలిపారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడతారని పేరున్న ముకేశ్ అంబానీ.. జామ్‌ నగర్‌ లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించడంతోపాటు అతిపెద్ద డేటా నెట్‌ వర్క్ - అత్యంత లాభదాయకమైన రీటెయిల్ సంస్థలను కలిగి ఉన్నారు. 2025 కల్లా రిలయెన్స్ సైజు రెండింతలవుతుందని ఈ మధ్య జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో అంబానీ చెప్పారు.
Tags:    

Similar News