300 కేజీల బంగారం దానం చేయనున్న ముఖేష్ అంబానీ?

Update: 2022-12-25 02:30 GMT
భారత పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ 2018 సంవత్సరంలో ఆనంద్ పిరమిల్ తో వివాహం జరిగింది. వీరిద్దరి దాంపత్యం సాఫీగా సాగుతున్న క్రమంలోనే ఇషా అంబానీ గత నెలలో కవలలకు జన్మనిచ్చింది. ఈ మేరకు నవంబర్ 19న ఇషా అంబానీ ఒక బాబు.. ఒక పాప జన్మనిచ్చినట్లు ఇషా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఇద్దరు పిల్లలకు అదియా.. కృష్ణ అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనను సైతం విడుదల చేశారు. "ఇషా.. ఆనంద్‌ పిరమిల్‌ తల్లిదండ్రులయ్యారనే విషయం మీకు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము.. ఆ దంపతులకు నవంబర్‌ 19న ఇద్దరు కవలలు జన్మించారు.. పాప అదియా.. బాబు కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని" ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖేష్ అంబానీ కూతురికి కవలలు జన్మించిన తర్వాత తొలిసారి ఇండియాకు వచ్చింది. అమెరికా నుంచి స్పెషల్ విమానంలో ఆమె ముంబైకి చేరుకుంది. దీంతో ముఖేష్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ముఖేష్ అంబానీ తన కూతురిని.. మనువడు.. మనవరాలిని సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు.

ఇషా అంబానీ వెంట అమెరికా నుంచి చిన్నపిల్లల వైద్యుడు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే బెస్ట్ చెఫ్ లను ముఖేష్ అంబానీ తన ఇంటికి రప్పించారు. అలాగే తిరుమల నుంచి వేద పురోహితులను రప్పించారు. ఈ క్రమంలోనే తన కూతురికి కవలలు పుట్టిన సందర్భంగా 300 కిలోల బంగారం దానం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ఈ ఏడాది 11 స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ.. కూతురు ఇషా అంబానీ సైతం వ్యాపార రంగంలో తండ్రిని మించిన తనయులుగా రాణిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News