ఇంకో సంచ‌ల‌నానికి ముఖేష్ రెడీ

Update: 2016-11-14 13:18 GMT
స‌మాచార‌ - ప్ర‌సార వ్యాపార రంగంలో త‌న‌దైన ముద్ర వేసుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న రిల‌య‌న్స్ సంస్థ‌ల అధిప‌తి ముఖేష్ అంబానీ జియోతో దీనికి శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. జియోతో టెలికాం సెక్టార్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ముఖేష్ ఇదే వ‌రుస‌లో మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌తి ఇంట్లోను త‌ప్ప‌నిస‌రి అయిన టీవీపై క‌న్నువేయ‌డం. జియో పేరు క‌లిసివ‌చ్చేలా జియో టీవీ పేరుతో కొత్త డీటీహెచ్ స‌ర్వీసుల‌ను ప్రవేశ‌పెట్టి త‌న‌దైన శైలిలో టెలివిజ‌న్ ప‌రిశ్ర‌మ‌కు చుక్క‌లు చూపించాల‌ని ముఖేష్ సిద్ధ‌మ‌య్యాడ‌ని అంటున్నారు.

డీటీహెచ్ సేవల్ని దేశ‌వ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌యిన క్ర‌మంలోనే ముందుగా త‌మ వ్యాపార కేంద్రానికి అచ్చివ‌చ్చిన ముంబైలో పైలెట్ ప్రాక్టుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే జియో డీటీహెచ్ ల‌ను ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం ఇవి జియో సిమ్‌ల వ‌లే ఉచితంగా ఇస్తున్నారా లేక‌పోతే చార్జీలు వాయిస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అధికారికంగా ఈ వివ‌రాలు వెల్ల‌డి కాక‌పోవ‌డంతో వివిధ వ‌ర్గాలు సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం జియో డీటీహెచ్ కు సంబంధించిన సెటప్ బాక్సులు - రిమోట్ లను రిలయన్స్ సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌త్యేకంగా జియో స్మార్ట్ బాక్స్ పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్సుల‌ను కూడా రిల‌య‌న్స్ సిద్ధం చేసింది. మొత్తం 360 చాన‌ల్లు - ఇందులో క‌నీసం 50 హెచ్‌ డీ ఛాన‌ల్లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇవ‌న్నీటికంటే మ‌రో దుమ్మురేపే ప్ర‌తిపాద‌న ఏంటంటే జియో డీటీహెచ్‌కు ప్ర‌త్యేకంగా రిమోట్ ఉంటుంద‌ట‌. అయితే అది అలాంటిలాంటిది కూడా కాదు. నోటి మాట ద్వారా ఛాన‌ల్ల‌ను మార్చుకునే ప్ర‌త్యేక‌త ఇందులో ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News