అంబానీ కోసం అర్ధరాత్రి తెర్చుకున్న అలిపిరి గేట్లు!

Update: 2016-09-02 05:21 GMT
దేవుడు గొప్పా.. ధనవంతుడు గొప్పా? దైవం గొప్పదా, ధనం గొప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు డబ్బున్నవారు ఒక రకంగా పేదవారు మరో రకంగా స్పందిస్తుంటారు. మరి రూల్స్ కూడా డబ్బున్న వారికి ఒకరకంగా, సాదారణ పౌరులకు మరో రకంగా ఉంటాయా? అంటే మిగిలిన చోట్ల తెలియదు కానీ మనదేశంలో అయితే ఇది కొంతవరకూ నిజమనే అనుకోవాలి. ఈ విషయాన్ని బలపరుస్తూ తాజాగా తిరుమలలో తాజాగా ఒక సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనపై పలు విమర్శలు వస్తున్నాయి.

విషయానికొస్తే... దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ విషయంలో రూల్స్ బ్రేక్ అయ్యాయి. ఆయన కోసం తిరుమలలోని అలిపిరి టోల్‌గేట్ అర్ధరాత్రి ఒంటిగంటకు కూడా తెరుచుకుంది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్దమైనప్పటికీ.. ఆ కుబేరుడి ముందు ఆ నిబంధనలు తలవంచక తప్పలేదు. అర్ధరాత్రి సమయం అయినా కూడా టోల్‌ గేట్ తెరవబడిండి.. తిరుమలకు స్వాగతం పలికింది.

ముకేష్ అంబానీ గురువారం అర్ధరాత్రి కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. సాధారణంగా ప్రతి రోజు రాత్రి 12 - ఉదయం 3 గంటల మధ్య ఈ టోల్‌ గేట్‌ మూసి ఉంటుంది. అయినప్పటికినీ టీటీడీ అధికారులు ముఖేష్ కోసం అర్ధరాత్రి టోల్‌ గేట్‌ ను తెరిచి కొండపైకి పంపడం అనే విషయం ఇప్పుడు పలు విమర్శలకు తావిస్తోంది.

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయాన్నే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ - తనయుడు అనంత్‌ లు దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. టిటిడి అధికారులు స్వయంగా పాల్గొని ఈ ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Tags:    

Similar News