రెండు రోజుల్లో 9300 కోట్లు..ముఖేషా మాజాకా..

Update: 2018-06-23 04:39 GMT
పుడితే అంబానీలా పుట్టాలి అని అందరూ అంటుంటారు. ధీరుభాయ్ అంబానీ నెలకొల్పిన రిలయన్స్ ను వారి పుత్రరత్నం ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే మేటి బ్రాండ్ గా విస్తరించాడు. భారతదేశంలోనే పెద్ద పారిశ్రామిక సంస్థగా నిలిపారు. ఈ మధ్యే జనాలకు జియోను పరిచయం చేసి దేశాన్ని డిజిటల్ బాట పట్టించారు. ముఖేష్ అంబానీ అంటే ఇప్పుడు ఇండియాలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ముఖేష్ తాజాగా అరుదైన ఘనత సాధించారు.

భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు - రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద కేవలం రెండు రోజుల్లోనే 9300 కోట్లు పెరిగి  మొత్తం సంపద విలువ 2.84 లక్షల కోట్లకు చేరింది. ఈ దెబ్బతో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నారు.

బ్లూమ్ బర్గ్ అనే  సంస్థ తెలిపిన వివరాల ప్రకారం స్టాక్ మార్కెట్ లో రిలియన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో రెండు రోజుల్లోనే ముఖేష్ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం సంపదను బట్టి చూస్తే ముఖేష్ అంబానీ.. చైనా  రిటైల్ మార్కెట్ దిగ్గజం  ‘అలీబాబా’  చైర్మన్ జాక్ మాతో సరిసమానంగా నిలిచారు.
Tags:    

Similar News