తమ్ముడు అనిల్ అంబానీ డబ్బు కట్టకపోతే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్ని గొడవలున్నా.. వ్యాపార విభేదాలున్నా.. రక్తసంబంధం ముఖేష్ అంబానీని ఆదుకునేలా చేసింది. తమ్ముడు అనిల్ అంబానీకి నేనున్నానంటూ ముందుకొచ్చి తమ్ముడి బాకీ పడ్డ రూ.458 కోట్లను అన్న ముఖేష్ అంబానీ చెల్లించాడు..
రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అధినేత అనిల్ అంబానీ వ్యాపారంలో కలిసిరాక పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయాడు. అన్న జియో టెలికాంతో దూసుకుపోతుంటే.. తమ్ముడు రిలయన్స్ తో రోజురోజుకు దాన్ని నడుపలేక అప్పులు తీసుకొచ్చి సంస్థను నడిపాడు. చివరకు అప్పులు భారీగా పెరిగిపోవడంతో చేతులెత్తేశాడు. ఆ తర్వాత స్వీడిష్ కంపెనీ ఎరిక్ సన్ కు రిలయన్స్ బాధ్యతలు అప్పగించారు. వారు 2014 నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను నిర్వహిస్తున్నారు. అయితే రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ఒప్పందం ప్రకారం ‘ఎరిక్ సన్ ’కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించలేదు. జాప్యం చేశాడు. దీంతో ఎరిక్ సన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరిలోనే సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా డబ్బులు చెల్లించాలని లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆదేశించింది. తాజాగా చివరి తేది మార్చి 19 అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మొత్తం 1500 కోట్లకు రిలయన్స్-ఎరిక్ సన్ మధ్య డీల్ కుదిరింది. అయితే ఎరిక్ సన్ ముందుగా గడువులోపు తమకు రూ.550 కోట్లు రిలయన్స్ నుంచి రావాలంటూ సుప్రీంలో 2018 సెప్టెంబర్ 30న దావావేసింది. డిసెంబర్ 15లోపు డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పుడు ఫిబ్రవరిలో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ సుప్రీం కోర్టులో రూ.118 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అనిల్ అంబానీ చేతులేత్తేశాడు.
తమ్ముడు అనిల్ అంబానీ రూ.458.77 కోట్లు ఎరిక్ సన్ కు చెల్లించేలా లేకపోవడం.. జైలుకు వెళ్లాల్సి రావడంతో అన్న ముఖేష్ అంబానీ ముందుకొచ్చాడు. వెంటనే ఆ డబ్బులను ఎరిక్ సన్ కు చెల్లించాడు. దీంతో సదురు ఎరిక్ సన్ కంపెనీ ప్రతినిధి తమకు డబ్బులు అందాయని సుప్రీం కోర్టుకు తెలిపాడు. ఆ మొత్తం డబ్బును అనిల్ అంబానీ అన్న ముఖేష్ అంబానీ చెల్లించాడు.
ఇలా తను జైలుకు వెళ్లకుండా కాపాడిన అన్న ముఖేష్ అంబానీ - వదిన నీతా అంబానీకి అనిల్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ్ముడిని ఆదుకొని అన్న ముఖేష్ ఆయన కుటుంబం పరువును కాపాడారని అందరూ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా తనను జైలు కెళ్లకుండా కాపాడిన అన్న ముఖేష్ కు రుణపడి ఉంటానని అనిల్ అంబానీ ఒక ప్రకటనలో బహిరంగంగా పేర్కొనడం విశేషం.