ఎస్పీ గెలిస్తే అఖిలేష్ సీఎం కాదా?

Update: 2016-10-14 11:34 GMT
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు? అదేమి ప్రశ్న... ప్రస్తుతం ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవే కదా అంటారా? అలా అయితే పొరబడ్డట్టే... ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎస్పీ గెలిస్తే అఖిలేషే ముఖ్యమంత్రి అవుతారని ములాయం సింగ్ యాదవే చెప్పడం లేదు. ఆరేంజ్ లో తండ్రీ కొడుకుల మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉందన్న మాట!! తాజాగా ఈ విషయాలను సమాజ్ వాదీ పార్టీ చీఫ్ - ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తేల్చి చెప్పారు.

లక్నోలో మీడియా సమావేశంలో పాగ్లొన్న ములాయాం 2017 ఎన్నికలపై స్పందించారు. ఈ సందర్భంగా... 2017లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధిస్తుందని, అయితే ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం పార్లమెంటరీ బోర్డు - కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని చెప్పారు.  ఈ ఒక్కమాటతో ఆ పార్టీలో చిన్నసైజు అలజడి మొదలైందట. యూపీ ప్రస్తుత ముఖ్యమంత్రి - ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ను రెండోసారి సీఎంగా కొనసాగిస్తారా లేదా అనే కొత్త అనుమానం ఎస్పీ వర్గాల్లో రేకెత్తింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసి - ములాయం మాత్రం జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టిసారించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కొంతకాలం బాగానే సాగినా తాజాగా ప్రభుత్వం పై పట్టు విషయంలో ములాయం ఇంట్లో ఆధిపత్యపోరు సాగుతోందని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ విషయంలో నేరుగా ములాయం తో అఖిలేష్ కి ఏమీ జరగకపోయినా, ములాయం సోదరుడు - యూపీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ కు అఖిలేష్ యాదవ్ కు మధ్య మాత్రం చిన్న సైజు వార్ నడిచిందని, ఫలితంగా వీరిద్దరి వివాదాల వల్ల ప్రభుత్వంలో, పార్టీలో కీలక పరిణామాలు జరిగాయని తెలుస్తోంది! అయితే ఈ ఫ్యామిలీ వార్ లో ములాయం సైతం జోక్యం చేసుకొవడంతో అప్పటికీ ఈ విబేధాలు సమసినట్టు కనిపించాయి.

ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ బాధ్యతలు సైతం శివపాల్ అప్పగించారు ములాయం. దీంతో సీఎం అఖిలేష్ ను సంప్రదించకుండానే తాజా అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు శివపాల్. ఇది జరిగిన తర్వాతే అఖిలేష్ అండ్ కో లు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారని భావిస్తోన్న తరుణంలో తాజాగా వచ్చే ఎన్నికలకు ఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ ను ములాయం ప్రకటించలేదు సరికదా ఆ సంగతి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెబుతున్నారు ములాయం!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News