ఆమెకు పాక్ పై కోపమా?అఖిలేశ్ పై కోపమా?

Update: 2016-10-31 05:05 GMT
ములాయం సింగ్ కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయి రాజకీయ ఆధిపత్యం కోసం సిగపట్లు పడుతుంటే ఆ ఇంటి కోడలు మాత్రం జాతీయ అంశాలపై మాట్లాడుతున్నారు. ములాయం ఇంటిపోరును దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ ములాయం చిన్నకోడలు అపర్ణ మాత్రం వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అచ్చం బీజేపీలా యాంటీ పాకిస్థాన్ ఐడియాలజీతో దూసుకెళ్లాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పాక్ పై మరోసారి సర్జికల్ దాడులు చేయాలని అంటున్నారు. అంతేకాదు... తన బావ అఖిలేశ్ సర్జికల్ దాడులపై అనుమానాలు వ్యక్తంచేయగా అపర్ణ మాత్రం మరిన్ని దాడులు చేయాలని అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

పాకిస్థాన్ ఇప్పటికైనా దారిలోకి రావాలని... లేకపోతే, మరిన్ని సర్జికల్ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ములాయం చిన్నకోడలు అపర్ణా యాదవ్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి - పోషించడాన్ని పాక్ ఆపేయాలని - సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను ఆపేయాలని - లేకపోతే భారత జవాన్ల మెరుపు దాడులను మరిన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. అయినా పాక్ వైఖరి మారుతుందని తాను భావించడం లేదని... ఆ దేశంపై మరిన్ని సర్జికల్ దాడులు జరిపితేనే బుద్దొస్తుందని అన్నారు.

అపర్ణ ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ సతీమణి. చదువుకున్న అమ్మాయి... సంగీతం వంటివాటిలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యతిరేక కూటమిలో ఈమె కూడా భాగస్వామి. భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై ఇంతకుముందు అఖిలేష్ స్పందిస్తూ, ఈ తరహా దాడులు గతంలో కూడా జరిగాయిని, తొలిసారిగా తామే చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, అఖిలేష్ కు భిన్నంగా అపర్ణ స్పందించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బావామరదళ్ల మధ్య డైరెక్టు మాటల యుద్ధాలూ జరుగుతాయేమో చూడాలి. మొత్తానికి అపర్ణ బావపై ఉన్న కోపాన్ని పాకిస్థాన్ పై చూపిస్తున్నట్లుగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News