ములాయం తాజా కోపానికి అసలు కారణం?

Update: 2017-01-30 05:24 GMT
లోలోన ఎన్ని గొడవలైనా ఉండొచ్చు..కానీ వాటి కారణంగా మొత్తానికి దెబ్బ పడకూడదు.  కానీ.. సరిగ్గా అలాంటి పరిస్థితే యూపీ అధికారపక్షంలో చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఫ్యామిలీలో చోటు చేసుకున్న పంచాయితీ కారణంగా తండ్రి.. కొడుకుల మధ్య నడిచిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజీకి వచ్చిన ములాయం.. ఆయన కుమారుడు అఖిలేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి సారిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అఖిలేశ్ తీరు సమాజ్ చీఫ్ ములాయంకు ఏ మాత్రం నచ్చటం లేదు. పొత్తు లెక్కలు ఒక కొలిక్కి వచ్చి.. టికెట్ల పంపిణీ జోరుగా సాగటమే కాదు.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యాదవ్ లు జాయింట్ గా ప్రెస్ మీట్ పెట్టి.. తమ ఉమ్మడి శత్రువులపై విమర్శిస్తున్న వేళ.. ములాయం సంచలన వ్యాఖ్య చేశారు.

కాంగ్రెస్ పార్టీతో తన కొడుకు పెట్టుకున్న పొత్తుపై తనకున్న అసంతృప్తిని ఆయన బాహాటంగానే కక్కేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్న విషయాన్ని చెప్పేసిన ఆయన.. తాజా ఎన్నికల్లో వారి తరఫున తాను ప్రచారం చేయనంటూ సంచలన వ్యాఖ్య చేశారు. తాజా ఎన్నికల్లో తాను ప్రచారం చేయనని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తును తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన ములాయం.. సొంతంగా పవర్ లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అనవసరంగా పొత్తు పెట్టుకున్నారని.. తనను నమ్ముకున్న నేతలకు టిక్కెట్లు రాలేదని.. వారుమళ్లీ ఐదేళ్ల వరకూ వెయిట్ చేయాల్సిందేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ములాయం బాధ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందునా? తన వారికి టిక్కెట్లు రానందుకా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News