భాగ్య నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో భారీ ఫ్లై ఓవర్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది.
ఎస్సార్ డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) పనుల్లో భాగంగా షేక్ పేట నుంచి విస్పర్ వ్యాలీ వరకు ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్ - మరో మూడు జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ల పనులకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పూర్తి చేసేందుకు జీచ్ ఎంసీకి అనుమతినిస్తూ అనుమతులు జారీ చేసింది.
రూ.263.09 కోట్లతో మూడు జంక్షన్ల పనులకు శనివారం జీవో జారీచేయగా, రూ. 333.55 కోట్లతో భారీ ఫ్లైఓవర్ పనులకు ఇటీవలే జీవో జారీ చేసింది. మొత్తం రూ.596.64 కోట్ల పనులకు టెండర్లు పిలవనున్నారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత క్రమంలో వీటిని నిర్మించాలని మంత్రి కేటీఆర్ భావించారు.
షేక్‌పేట కులీఖుతుబ్ షాసెవెన్ టూంబ్స్ నుంచి ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్(మహా ప్రస్థానం) వరకు దాదాపు 2.8 కి.మీ.ల మేర ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఐటీ హబ్ వైపు వెళ్లే ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఐటీ కారిడార్ లోని మియాపూర్ - గచ్చిబౌలి ప్రాంతాల్లో 1.8 కి.మీ. పరిధిలో బొటానికల్ గార్డెన్ - కొత్తగూడ - కొండాపూర్ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.ఈ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు - ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తయితే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.
కాగా, నాలాల ఆధునీకరణ పనుల కోసం మరో రూ. 230 కోట్లకు ప్రభుత్వం జీహెచ్ ఎంసీకి అనుమతులిచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు కలిపితే దాదాపు రూ. 928 కోట్ల రూపాయలవుతుంది. ఈ ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా పనుల కోసం బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా రూ. 3500 కోట్లు సేకరించాలని భావించారు. ఈ సేకరణకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే దాకా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/