ఆరి దుర్మార్గుల్లార్రా..మదీనాను కూడా వదలరా?

Update: 2016-07-05 06:05 GMT
మతం పేరిట ఉగ్రవాదం చేసే రాక్షసులకు మతం మీద ఎలాంటి విశ్వాసం లేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద చర్య చేసినా.. ఉగ్రవాదులు దానికి ఏదో ఒక వాదనను వినిపించి.. తాము చేసిన పనిని సమర్థించుకోవచ్చు. మరి.. ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రెండు ప్రదేశాలైన మక్కా.. మదీనాల్లో ఒకటైన మదీనా దగ్గర ఆత్మాహుతి దాడిని ఎలా అర్థం చేసుకోవాలి..? అన్నదే ఇప్పుడు తెర మీదకు వచ్చిన ప్రశ్న.

ప్రఖ్యాత మదీనాలోని మహ్మద్ ప్రవక్త మసీదు సమీపంలో ఆత్మాహుతి దాడి జరగటం ఇప్పుడు అందరిని నివ్వెరపోయేలా చేస్తోంది. అదే సమయంలో.. ఉగ్రవాదులకు మతం.. దేవుడు.. భక్తి ఇలాంటివేమీ ఉండవని.. అమాయకుల ప్రాణాలు తీయటమే తప్పించి.. మరింకేమీ వారికి ముఖ్యం కాదన్న విషయం తాజా ఉదంతంతో తేలిపోయిందని చెప్పాలి.

ప్రఖ్యాత మదీనా మసీదు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మరణించినట్లుగా చెబుతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో.. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మసీదుకు వద్ద రక్తపాతానికి ఒడిగట్టటం చూస్తే.. ఉగ్రవాదులు మనుషుల రూపంలో ఉన్న అసలుసిసలు రాక్షసులనటంలో ఎలాంటి సందేహానికి గురి కావాల్సిన అవసరం లేనట్లే.
Tags:    

Similar News