మల్టీప్లెక్స్ కి 5 లక్షల ఫైన్

Update: 2016-02-02 04:12 GMT
మల్టీప్లెక్సుల్లో వస్తువుల రేట్లు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు తెలిసిన వ్యవహారమే. కానీ అడ్డగోలుగా వసూలు చేసే వ్యవహారంపై ఓ  ప్రేక్షకుడు కోర్టుకు వెళ్లడంతో.. మల్టీప్లెక్సుపై ఐదు లక్షల జరిమానా విధించింది స్టేట్ కంజూమర్ కమిషన్.

కుమార్ అనే ప్రేక్షకుడు జైపూర్ లో బిగ్ సినిమాస్ కు వెళ్లి వాటర్ బాటిల్ అడగ్గా.. అతన్ని 30 రూపాయలు డిమాండ్ చేశారు నిర్వాహకులు. కానీ ఆక్వాఫినా బాటిల్ ఎంఆర్పీ 16రూపాయలే కావడంతో.. అదనపు మొత్తం చెల్లించడానికి అతను నిరాకరించాడు. దీంతో లాగ్ బుక్ ఇస్తే కంప్లెయింట్ రాస్తానన్న ప్రేక్షకుడితో.. థియేటర్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఈ వ్యవహారంతో మనస్తాపం చెందిన కుమార్.. ఆ రాష్ట్ర వినియోగదారుల కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసును విచారించిన స్టేట్ కంజూమర్ కమిషన్.. ఆ కస్టమర్ కు రూ.14తో పాటు మానసికంగా వేధించినందుకు గాను 6,500చెల్లించాలని చెప్పింది. దీనిపై జాతీయ కమిషన్ కు అప్పీల్ కు వెళ్లింది బిగ్ సినిమాస్. తాము ఉచితంగా తాగు నీటిని ఏర్పాటు చేశామని, ఇలా ఛార్జ్ చేయడంలో తప్పు లేదని వాదించింది. అయితే.. వీరి వాదనను ఖండించిన నేషనల్ కన్జూమర్ కమిషన్.. 5లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో రెండు ఎమ్మార్పీలతో పెప్సీకో స్టాక్ పంపుతుందని ప్రూవ్ అయినా.. ఫిర్యాదు లేకపోవడంతో కేసు నుంచి ఆ కంపెనీ బయటపడింది.

ఇప్పుడోసారి.. మన హైదరాబాద్‌ లో ఏ రేట్లకు వాటర్‌ బాటిల్‌ అమ్ముతున్నారో ఓ మారు గుర్తు చేసుకోండి మరి.
Tags:    

Similar News