ఓటీటీ ముసుగులో పోర్న్ వీడియోలు తీస్తూ.. అమాయక యువతను ఆ రొంపిలోకి దించుతున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల్లో నటించాలనుకొనే అమాయకులైన యువతులను ఈ ముఠా టార్గెట్ చేస్తున్నది. ఓటీటీలో అవకాశం కల్పిస్తామంటూ పోర్న్ వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను పోర్న్ సైట్లలో .. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దందా నడుపుతున్నారు. తాము తీయబోయే ఓటీటీ సీరిస్ కు నటీనటులు కావాలంటూ ఈ ముఠా ప్రకటనలు ఇస్తుంది. నమ్మి వాళ్ల దగ్గరకు వెళ్లిన అమాయకులను టార్గెట్ చేస్తున్నారు.
ముంబై పోలీసులు పక్కా సమాచారంతో మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాపై రైడ్ చేశారు. అయితే ఇక్కడ ఓ మహిళా ఫొటోగ్రాపర్ పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తుండటం చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. బంగ్లాలో రైడ్ చేసి.. ఇద్దరు మగ పోర్న్ నటులను - ఓ లైట్ మ్యాన్ - గ్రాఫిక్ డిజైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నటిని కూడా ఈ ముఠా బలవంతంగా ఈ రొంపిలోకి దింపిందని పోలీసులు పేర్కొన్నారు. సదరు నటిని కాపాడామని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి కేదారి పవార్ మీడియాకు చెప్పారు.
ఈ ముఠా నుంచి రూ. 6 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ లు - కెమెరాలు - 6 స్మార్ట్ పోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా రెండేళ్లలో రూ. 36 లక్షలు సంపాదించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముంబై మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో ఏదో జరుగుతున్నట్టు స్థానికులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టు రట్టు అయ్యింది.