పెళ్లికొడుకులా ఐఫోన్ కొన‌డానికెళ్లాడు

Update: 2017-11-05 04:36 GMT
రెక్క‌ల గుర్రం మీద రాజ‌కుమారుడిలా కుర్రాడు.. జీన్స్, టీ ష‌ర్ట్, స‌న్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్‌గా కూర్చున్నాడు. అత‌ని చుట్టూ ఒక ప‌ది మంది వ‌రకూ ఉన్నారు. అంతేగాక కొంత‌మంది డ‌ప్పుల‌తో హోరెత్తిస్తున్నారు. అంతా వారిని ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. పెళ్లి కొడుకు అనుకుందామంటే.. అక్క‌డి వాతావ‌ర‌ణం అలా క‌నిపించ‌డం లేదు. వీళ్లంతా ఎక్క‌డికి వెళుతున్నారో అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో వీరంతా ఒక మొబైల్ దుకాణం దగ్గ‌ర ఆగారు. ఇంత‌లో అక్క‌డికి షాపు య‌జ‌మాని వ‌చ్చాడు. వెంట‌నే గుర్రంపై ఉన్న వ్య‌క్తికి ఫోన్ ఇచ్చాడు. దానిని అందుకంటూ.. అత‌డు ఇచ్చిన ఫోజులు అన్నీ ఇన్నీ కావులెండి! మ‌రి ఎందుకు ఇవ్వ‌డు అంద‌రూ ఎప్పుడెప్పుడు ఉప‌యోగిద్దామా అని ఎదురుచూసే ఐఫోన్‌ని ద‌క్కించుకుంటే అంత‌కంటే ఎక్కువే ఇవ్వాలి మ‌రి!!

ఐఫోన్‌.. అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఐఫోన్‌ను ద‌క్కించుకునేందుకు ఆస్తులు అమ్మేసిన వాళ్లున్నారు. చివ‌ర‌కు దొంగ‌త‌నాలు చేసిన వారు కూడా లేక‌పోలేదు. ఐఫోన్ స్టోర్ల ముందు భారీ క్యూలైన్లు క‌డుతుంటారు. విదేశాల్లోనే కాదు ఇప్పుడు భార‌త్‌లోనూ ఐఫోన్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న‌. మ‌న‌లో చాలామందికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కొనాల‌నున్నా.. రేటు చూస్తే గుండె జారిపోతుంది. మ‌న‌లానే మ‌హారాష్ట్ర‌లోని థానే ప్రాంతానికి చెందిన మ‌హేశ్ ప‌లివాల్‌కి ఐఫోన్లంటే చాలా ఇష్టం.

అందుకే ఐఫోన్ ఎక్స్ కొన‌డానికి పెళ్లికొడుకులా బ‌య‌ల్దేరాడు. గుర్రం మీద ఎక్కి, బ్యాండ్‌బాజాల‌తో వెళ్లి ఐఫోన్ ఎక్స్ కొన్నాడు. `ఐ ల‌వ్ ఐఫోన్ ఎక్స్‌` అనే ఫ్లెక్సీ ప‌ట్టుకుని థానే రోడ్ల మీద హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఐఫోన్ మీద ప్రేమ‌తో తాను ఇలా వినూత్నంగా ప్ర‌య‌త్నించాన‌ని మ‌హేశ్ చెప్పాడు. అంతేకాదు... ఐఫోన్ ఎక్స్ ఫోన్‌ని కూడా గుర్రం మీద ఉండే అందుకున్నాడు. త‌ర్వాత గుర్రం మీద ఫోన్‌తో పోజులు
Tags:    

Similar News