ముంబైలో మరో కరోనా మరణం..11కు చేరిన మృతుల సంఖ్య!

Update: 2020-03-24 08:43 GMT
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 500 కి దాటిపోయింది. చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం ఇప్పటివరకు 11  మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.

తాజాగా మంగళవారం  మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు కరోనా భారిన పడి మరణించాడు. సోమవారం  డు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి  -    ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే మరణించాడు. మృతుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ వచ్చాడు అని సమాచారం. ఆ తరువాత  అక్కడి నుంచి 20వ తేదీన ముంబై చేరుకున్నాడు. దగ్గు - జ్వరం రావడంతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు. హాస్పిటల్ లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వ్యక్తి మరణించాడు.

మరోవైపు దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతో.. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. దీనితో కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలని లాక్ డౌన్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వ సూచనలని కొంతమంది బేఖాతరు చేస్తూ ఇష్టం వాచినట్టు బయట తిరుగుతున్నారు. ఇకపోతే, చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి.


Tags:    

Similar News