టీవీ న్యూస్ చానెల్స్ రేటింగ్ స్కాం బట్టబయలు?

Update: 2020-10-08 14:45 GMT
మహారాష్ట్ర రాజధాని ముంబైలో టీవీ చానెల్స్ రేటింగ్ స్కాం బయటపడి సంచలనమైంది. నకిలీ టీఆర్పీ రేటింగ్ ల బాగోతాన్ని ముంబై పోలీసులు బయటపెట్టారు. ఇక ఈ స్కాంలో రిపబ్లికన్ టీవీ టీఆర్పీ రేటింగ్ లో స్కాంకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

రిపబ్లికన్ టీవీని చూడాలని కోరుతూ రేటింగ్ మీటర్లను ఫిక్ చేసిన ఇళ్లలో.. డబ్బులు పంచుతున్న వ్యవహారాన్ని ముంబై పోలీసులు బయటపెట్టారు. రేటింగ్స్ ను పెంచడానికి ఒక చానల్ ను ఫిక్స్ చేసి.. అదే చానల్ ను చూడడానికి ఇంటికి రూ.500లను రిపబ్లిక్ టీవీ ఇస్తున్నట్టు ముంబై పోలీసులు మీడియాకు తెలిపారు.

రేటింగ్ లను పర్యవేక్షిస్తున్న హంసా కంపెనీలో కొందరు మాజీ ఉద్యోగులు రేటింగ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది.తాజాగా రిపబ్లిక్ టీవీ యాజమాన్యం, డైరెక్టర్లను ఈ వ్యవహారంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

రిపబ్లిక్ టీవీతోపాటు మరో 2 లోకల్ చానెల్స్ రేటింగ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని ముంబై పోలీసులు తెలిపారు.రిపబ్లిక్ టీవీకి వస్తున్న రేటింగ్స్ పై అనుమానలున్నాయని.. దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో రేటింగ్ స్కాం జరుగుతున్నట్లు సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు.

అయితే రిపబ్లిక్ టీవీ యాజమాన్యంపై వస్తున్న వార్తలపై ఆ చానెల్ అధినేత , ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి స్పందించారు. ముంబై పోలీసులు కావాలనే రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేశారని.. రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ ను అడ్డుకున్న సంజయ్ రౌత్ తమ్ముడిపై చర్య తీసుకునే దమ్ముందా అని ముంబై పోలీసులను అర్నాబ్ సూటిగా ప్రశ్నించారు. సుశాంత్ కేసు, పాల్ఘర్ ఘటనను ప్రశ్నించినందుకే మహారాష్ట్ర సర్కార్ కక్ష సాధిస్తోందని అర్నాబ్ మండిపడ్డారు.
Tags:    

Similar News