టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ లలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొంతకాలంగా తీవ్రమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల వరకు....తామూ గతంలో క్యాస్టింగ్ కౌచ్ బాధితులమేనని తమ గోడు వెళ్లబోసుకున్న వైనంపై పలు మహిళా సంఘాలూ మండిపడ్డాయి. అయితే, ఇప్పటివరకు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదులు ఇవ్వడం....వంటివి విన్నాం. అయితే, తాజాగా ముంబైలో ఓ జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన నిర్మాతకు ఏడేళ్ల శిక్షపడడం సంచలనం రేపింది. ఆ ఆర్టిస్టును సదరు నిర్మాత అత్యాచారం చేసినట్లు అభియోగాలు రుజువు కావడంతో అతడికి ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
2012లో 'ఏక్ వీర్ కీ అరదాస్ వీర్' టీవీ షో నిర్మాతగా ఉన్న ముకేష్ మిశ్రా (33)...ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు (33)కు తన సీరియల్ లో అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఉందంటూ పొద్దున్నే రావాలని ఆమెకు ఫోన్ చేశాడు. బస్ స్టాప్ దగ్గర వేచి ఉన్న ఆమెకు ...మాయమాటలు చెప్పి తన బైక్ పై మేకప్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని ....పదే పదే ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో, ఏడాదిపాటు అతడి వేధింపులు భరించిన బాధితురాలు....2013లో భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఐదేళ్లపాటు ఆ కేసు విచారణ సాగింది. తాజాగా, ముకేష్ దోషేనని ముంబై ప్రత్యేక మహిళా కోర్టు తేల్చింది. దీంతో, ముకేశ్ కు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తున్నట్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.