ప్రస్తుత రోజుల్లో పోలీస్ స్టేషన్స్ లో నమోదైయ్యే కేసుల్లో ఎక్కువ శాతం మిస్సింగ్ కేసులే ఉంటున్నాయి. డబ్బు కోసం కొందరు ..ఇంకో దానికి కోసం కొందరు ..పిల్లలని , పేదవారిని ఎత్తుకెళ్లి పోతున్నారు. ఇలాంటి కేసుల్ని పరిష్కారించాలి అంటే పోలీసుల కి ఒక పెద్ద సవాల్ లాంటిది. ఎందుకు అంటే కిడ్నాప్ చేసే వారు చాలా పక్కాగా ప్లాన్ చేసి ..ఏమాత్రం క్లూ కూడా లేకుండా చేస్తున్నారు. అలాంటి కేసులు దేశంలో ఒక్క రోజులోనే ఎన్నో నమోదౌతున్నాయి.
అలాంటి ఎన్నో మిస్సింగ్ కేసులని ముంబై లోని హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ పాండే సాల్వ్ చేసారు. ఈయన ఒకటి ..రెండు కాదు ఏకంగా వెయ్యి మిస్సింగ్ కేసులని ఛేదించాడు. ఫెయిల్యూర్ అన్న మాట తన జీవితం లో వినలేదు . చేసిన ప్రతి మిషన్ సక్సెస్. అందుకే ఆ పోలీస్‌ను ముంబై షెర్లాక్ హోమ్స్ అంటున్నారు. మిస్సింగ్ కేసు వచ్చిందంటే ముంబై పోలీసులకు కనపడే ఏకైక వ్యక్తి , వినపడే మొదటిపేరు హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ పాండే. అవును మరి అయన ట్రాక్ రికార్డ్ ఆలా ఉంది మరి. ఇప్పటివరకు అయన వద్దకి వచ్చిన మిస్సింగ్ కేసుల్లో ఒక్క కేసు తప్ప మిగిలిన అన్ని కేసుల్లో విజయం అతనిదే. ఆయన కథ ఆధారంగా ఓ సినిమానే తీయచ్చు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ సినిమా తీసేందుకు ముందుకొచ్చాడు. పోలీసుల పర్మిషన్ తీసుకున్నాడు.
2011లో ఓ అబ్బాయి మిస్సింగ్ కేసుతో స్టార్ట్ అయింది రాజేశ్ పాండే సక్సెస్. తన సొంత తండ్రి చేతి లోనే కిడ్నాప్ అయిన అబ్బాయి ని రక్షించారు రాజేశ్ పాండే. ఆ కేసు ను పరిష్కరించేందుకు ఎన్నో ప్రయాసలు పడ్డారు. తన స్కిల్స్ అన్నీ వాడి ఆ అబ్బాయి జాడ కనుక్కున్నారు. ఇక, అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకున్న సందర్భాలు అరుదు. వేరే నేరాలతో పోలిస్తే మిస్సింగ్ పర్సన్స్ కేసులను పరిష్కరించడం, ప్రత్యేకించి పిల్లలను కాపాడడమే నాకు ముఖ్యం అని రాజేశ్ పాండే చెబుతారు. ఆయన పనితనం నచ్చి ముంబై రిటైర్డ్ పోలీస్ కమిషనర్ దత్త పాద సాల్గికర్, ‘పాండే మాడ్యూల్’ను పెట్టారు. అంటే, మిస్సింగ్ కేసులను విచారించే ఏ అధికారి అయినా ఆయన ఫాలో అయ్యే పద్ధతులను పాటించడం దాని ఉద్దేశం.
ఈయన కేసులని విచారించే సమయం లో అనేక అవతారల్లోకి మారిపోతారు. కేసులను సాల్వ్ చేసేందుకు రాజేశ్ పాండే అందరి తోనూ పరిచయాలు పెంచుకుంటారు. స్థానికంగా ఉండే దర్జీలు, గెస్ట్ హౌస్ ఓనర్లు, బార్ ఉద్యోగులతో పరిచయాలు ఉన్నాయి. 2014లో ఓ ఇంట్లో పనిచేసే అమ్మాయి మిస్సింగ్ కేసును కొరియర్‌బాయ్‌గా వేషం కట్టి పరిష్కరించారు ఆయన. ఆ అమ్మాయి మిస్సయ్యాక ఏ ఒక్క క్లూ లేక పోయినా ఒక చిన్న ఫోన్ కాల్ పట్టుకొని ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి చేర్చాడు.అయన 26 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఎన్నో కష్టమైన కేసులను పరిష్కరించి తోటి పోలీసులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదంతా మీకు ఎలా సాధ్యం అని అడిగితే .. తన కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నాలెడ్జ్‌ను వాడుకుని కేసులను పరిష్కరించగలిగానని రాజేశ్ పాండే చెబుతారు.