ఎన్ఐఏ చేతుల్లోకి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు..!

Update: 2021-10-07 05:56 GMT
గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రాపోర్టులో ఇటీవల పట్టుబడిన రూ. 21వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్‌ లో పట్టుబడిన నార్కోటిక్స్ కేసు విచారణ ఎన్ ఏ ఐ కు బదిలీ అయ్యింది. కేంద్రం హోంశాఖ,
ఎన్ ఏ ఐ దర్యాప్తు కొనసాగించేందుకు బుధవారం ఆమోదముద్ర వేసింది.  ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌ కు నౌకల ద్వారా రూ.21వేల కోట్ల విలువైన 3వేల కిలోల డ్రగ్స్‌ను డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది.

గుజరాత్‌ లో పట్టుబడిన నార్కోటిక్స్‌ కేసు విచారణ ఎన్‌ ఐఏ కు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ ఐఏ దర్యాప్తు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే డీఆర్‌ ఐ నుంచి ఎన్‌ ఐఏ అధికారులు ఈ కేసును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. నార్కోటిక్స్‌ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తంకావడంతో కేంద్రం ఈ కేసును ఎన్‌ ఐఏ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతి, ఉగ్రవాద మూలాలపై ఎన్‌ ఐఏ దర్యాప్తు చేయనుంది.

సెప్టెంబర్ 15న ముంద్రా నౌకాశ్రయంలో భారీగా హెరాయిన్‌‌ను పట్టుకున్నారు. అయితే దీని వెనుక తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ సూత్రధాధారిగా ఉన్నారు. అయితే, అసలు సూత్రధారి మాత్రం ఢిల్లీ చెందిన వ్యక్తి అని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే.. ఆఫ్ఘన్ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో ఈ మాదక ద్రవ్యాలు ముంద్రా పోర్టుకు వచ్చాయి. అయితే, చీకటి వ్యాపార సంబంధాలపై అనుమానం రాకుండా ఇలా చేశారని నిఘా, దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో సూత్రధారి మాత్రం డ్రగ్స్ మాఫియాలో కింగ్‌ పిన్ ఢిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ డ్రగ్స్ ను ఢిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహంగా గుర్తించాయి. నిఘా దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి, దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు తేల్చాయి. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్ ఇందులో పాత్రధారిగా ఉన్నాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి, దాన్ని డ్రగ్స్ సరఫరా ముఠాలకు అందించాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఏడాది జూన్ నెలలో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్ ముసుగులో సుమారు 25 టన్నుల హెరాయిన్ ఆప్ఘానిస్థాన్ నుంచి దిగుమతి అయ్యిందని, అది కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి. 
Tags:    

Similar News