బీజేపీ తెలంగాణ చీఫ్.. బండి సంజయ్.. అంతా నేనే.. అంతా నాదే.. అన్న రేంజ్‌లో రాజకీయాలు చేస్తు న్న విషయం తెలిసిందే. ఎక్కడ ఎలాంటి ప్లస్ వచ్చినా.. ఆయన తన ఖాతాలోనే వేసుకుంటున్నారని.. బీజేపీ లోని ఓ వర్గం ఎప్పటి నుంచో గుస్సాగా ఉంది. మంచి అయితే.. ఆయన ఖాతాలో వేసుకుని.. చెడు అయితే.. మాత్రం కొందరు నేతలపైకి.. నెట్టేస్తున్నారనే వాదన కూడా కొన్నాళ్లుగా అంతర్గతంగా వినిపి స్తోంది. దీంతో ఈ చర్చ ఇప్పుడు మరోసారి తెరమీదికి వచ్చింది.
మరీ ముఖ్యంగా.. కేంద్రంలోని పెద్దల దృష్టిలో పడేందుకు సంజయ్.. ఈ వ్యూహంతోనే ముందుకు వెళ్తు న్నా రన్నది వారి వాదనగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీని చూసుకుంటే.. పైకి యూనిటీగా ఉన్నామ ని.. చెబుతున్నా.. పాతతరం నేతలతో ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. అది కొత్తగా వచ్చిన వారి కష్టం వల్లే.. కమల నాథులకు ప్లస్ అవుతోంది. అంతే తప్ప.. అప్పటి వరకుఉన్న బండి సంజయ్ వల్లో.. మరొకరి వల్లో కాదనేది స్థానిక నేతల అభిప్రాయం.
ఉదాహరణకు.. దుబ్బాకలో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందనరావు పోటీ చేసి.. విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇక్కడ ఇతర నేతల ప్రచారం ఎలా ఉన్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం కేవలం రఘు ఫొటో చూసి.. ఆయన హామీలు విని.. ఆయనపై ఉన్న నమ్మకం.. విశ్వాసంతోనే.. వారు ఆయనకు ఓటేశారు. కానీ, ఇక్కడ గెలిచిన తర్వాత.. క్రెడిట్ అంతా.. తన ఖాతాలోనే వేసుకున్నారు బండి సంజయ్.
నేను వేసిన వ్యూహంతోనే దుబ్బాకలో మంత్రి హరీష్ రావు ఎత్తు గడలకు చెక్ పెట్టామన్నారు. కట్ చేస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ మంత్రి.. టీఆర్ ఎస్ అప్పటి నాయకులు.. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప పోరు వచ్చింది. ఇక్కడ అసలు బీజేపీ ఊసే లేదు. ఎప్పుడూ.. ఇక్కడ జెండా ఎగిరింది కూడా లేదు. అయినప్పటికీ.. ఇక్కడ.. బీజేపీ విజయం దక్కించుకుంది. దీనికి కారణం.. ఫక్తుఈటల ఫేసే..! అయినా.. కూడా తగుదనమ్మా అంటూ.. బండి ఈ గెలుపును కూడా.. తనవైపు తిప్పుకొన్నారు.
దీంతో ఎక్కడ ఎలాంటి ప్లస్‌వచ్చినా.. అది బండికే దక్కుతోందని.. తాము ఎంతోకష్టపడి.. రోడ్డుమీద తిరిగి, ఇంటింటికీ వెళ్లి.. ఓట్లు తెచ్చుకుంటే.. అది ఏమాత్రం.. తమకు దక్కకపోగా.. బండి ఇమేజ్.. గ్రాఫ్ పెరుగుతోందనే చర్చ బీజేపీ నేతల మధ్య తరచుగా జరుగుతున్న సంభాషణ. ఈ నేపథ్యంలోనే తాజాగా.. మునుగోడు ఉప పోరులో.. బండిని పక్కన పెట్టాలనే వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలస్తోంది. ఇక్కడ కూడా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇమేజే బీజేపీకి వరంగా మారింది.
అంతకుమించి.. ఎవరూ కూడా.. కోమటిరెడ్డిని గెలిపించే పరిస్థితి లేదు. అంటే.. ఇక్కడ బీజేపీ గెలిస్తే.. కనుక అది పూర్తిగా.. కోమటిరెడ్డి విజయమే తప్ప.. మరొకరిది కాదనేకాదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బీజేపీలోని ఓవర్గం.. బండి వల్ల మాకు ఎలాంటి ఓట్లు రావడం లేదు. కాబట్టి.. మాకు.. ఆయన అవసరం లేదనే వాదనను వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.