బెట్టుకు పోతే.. వైసీపీకి మొట్టికాయ‌లే!!

Update: 2021-02-27 16:30 GMT
వ్యూహం-ప్ర‌తి వ్యూహం అనేవి రాజ‌కీయాల్లో కామ‌న్‌. అయితే.. అధికార పార్టీ నేత‌లు మాత్రం వ్యూహ‌మే త‌ప్ప ప్ర‌తివ్యూహానికి ఆస్కార‌మే లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న కార్పొరేష‌న్‌, మునిసిపాలి టీ ఎన్నిక‌ల్లో అంతా స‌జావుగానే ఉంద‌ని.. త‌మ‌కు తిరుగులేద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. అంతేకాదు.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాము క‌నుక .. త‌మ‌కు ఇక‌, కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో గెలుపు కొట్టిన పిండేన‌ని భావిస్తున్నారు. దీంతో ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు.

చుల‌క‌న భావంతో...
అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌ను, తాజాగా టీడీపీ వెలువ‌రించిన కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను కూడా లైట్ తీసుకుంటున్నారు. కొంద‌రు వైసీపీ నాయ‌కులు మ‌రో అడుగు ముందుకు వేసి.. స్థానికానికి కూడా మేనిఫెస్టో విడుద‌ల చేస్తారా? అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. సీనియ‌ర్ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. ఏకంగా ఈ మేనిఫెస్టోను 420గా అభివ‌ర్ణించారు. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నాయ‌కులు టీడీపీ అధినేత‌ను, ఆ పార్టీ మేనిఫెస్టోను చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నార‌నే విష‌యం అర్ధ‌మైంది.

ఇక‌, ఇప్పుడు వాస్త‌వం చూద్దాం..
ఎన్నిక‌లు ఏవ‌నే కాదు.. ఎలాంటి వ‌నేవీ కాదు.. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపుతిప్పుకోవ‌డ‌మే రాజ‌కీయ పార్టీల ప‌ని. ఏ స్థాయి ఎన్నిక‌లైనా.. ఓట‌ర్లు క‌రుణిస్తేనే క‌దా.. నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కేది. సో.. ఈ విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు ఎందుకో మ‌రిచిపోయిన‌ట్టున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన కీల‌క హామీ రూ.5 కే భోజ‌నం పెట్టే అన్న క్యాంటీన్ల‌ను తిరిగి తెరుస్తామ‌ని. ఇది.. వైసీపీ తీసిపారేసినంత తేలిక విష‌యం కాదు. ఖ‌చ్చితంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో పేద‌లు.. ఈ క్యాంటీన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం మండుతున్న ధ‌ర‌ల‌తో ఒక‌పూట తింటే రెండో పూట లేక అల్లాడుతున్న పేద‌లు.. ఇలాంటి క్యాంటీన్లు ఉంటే బాగుండున‌ని అనుకుంటున్నారు. మ‌రి.. దీనిని త‌క్కువ‌గా చూస్తే.. వైసీపీనే న‌ష్ట‌పోతుంది.  

మొట్టికాయ‌లు త‌ప్పవు!!
ప‌న్నుల త‌గ్గింపు. అదేవిధంగా నీళ్ల‌కుళాయిల‌ను ఇంటింటికీ ఇవ్వ‌డం. వైసీపీ స‌ర్కారు.. వ‌చ్చే ఏప్రిల్ 1 నుంచి న‌గ‌రాలుప‌ట్ట‌ణాల్లో ఇంటి ప‌న్నులు, ఆస్తుల ప‌న్నులు పెంచుతోంది. ఈనేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ గురి చూసి.. ఇక్క‌డే కొట్టింది. ప్ర‌స్తుతం టీడీపీ మేనిఫెస్టో.. భారీ ఎత్తున వైర‌ల్ అవుతోంది. కాబ‌ట్టి.. దీనిని లైట్ తీసుకుంటే.. వైసీపీ న‌ష్ట‌పోవ‌డంఖాయం. లేదా.. దీనికి దీటుగా వైసీపీ నాయ‌కులు కూడా అధిష్టానం నుంచే హామీలు ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. పంచాయ‌తీల్లో టీడీపీకి.. ప్ర‌స్తుత టీడీపీకి చాలా వేరియేష‌న్ క‌నిపిస్తోంద‌న్న వాస్త‌వాన్ని మ‌రిస్తే.. వైసీపీకి న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో మొట్టికాయ‌లు త‌ప్పవు!!
Tags:    

Similar News