అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చేయటం తెలిసిందే. పెద్ద ఎత్తున వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లే అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే.. అంత సునాయాసంగా ఈ విజయం సొంతం కాలేదన్న విషయం ఓటింగ్ సరళిని చూస్తే అర్థం కాక మానదు. అయితే.. ఈ ఉప పోరులో తన గెలుపు ఖాయమని నమ్మకంగా చెప్పుకున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు మాత్రం ఆడియాశలయ్యాయి. ఆయన అంచనాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
అయితే.. అధికార పార్టీకి ఈ ఉప పోరులో మూడు చెరువులు తాగించినట్లుగా కోమటిరెడ్డి సన్నిహితులు చెబుతున్నా.. ఇదంతా కవరింగ్ అంటూ గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఈ ఉపపోరు ఫలితం తేడా రావటానికి.. కోమటిరెడ్డి ఓటమికి రెండు మండలాలే కీ రోల్ ప్లే చేశాయని చెబుతున్నారు. ఈ మండలాల్లో వచ్చిన ఫలితం.. కోమటిరెడ్డి సంచలన విజయాన్ని అడ్డుకుందన్న మాట వినిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఓట్ల లెక్కింపు ప్రారంభం ముందు వరకు వార్ వన్ సైడ్ మాదిరి ఉంటుందని.. ఎన్నికల ఫలితం ఏకపక్షంగా ఉంటుందని చెప్పిన దానికి భిన్నంగా మొదలు నాలుగు రౌండ్ల ఫలితాలు ఒకలా.. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడటం చూశాం.
అయితే.. బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకున్న రెండు మండలాలు (చౌటుప్పల్.. చండూరు) పువ్వు పార్టీని నిలువునా ముంచేశాయని చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పై అధిక్యతను ప్రదర్శించటానికి ఈ రెండు మండలాలు సాయం చేస్తాయనుకుంటే.. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడటం గమనార్హం. దీంతో.. బీజేపీ అనుకున్నట్లుగా ఫలితం రాని పరిస్థితి.
మనుగోడులో మొత్తం 2.40 లక్షల ఓట్లు ఉంటే.. ఒక్క చౌటుప్పల్ మండలంలోనే 83 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 23 వేల ఓట్లు ఉంటే.. కేవలం 17 వేల ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ మరిన్ని ఓట్లు పోల్ అయి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. చాలా గ్రామాల్లో 90 ప్లస్ పోలింగ్ జరిగితే.. చౌటుప్పల్ పట్టణంలో మాత్రం 73 శాతం ఓట్లు పోల్ కావటం కూడా తమను దెబ్బేసిందని బీజేపీ విశ్లేషిస్తోంది.
చౌటుప్పల్ తర్వాత బీజేపీ ఆశలు పెట్టుకున్న మరో మండలం చండూరు. ఇక్కడి మూడు రౌండ్లలో ఒక్క రౌండ్ లోనే బీజేపీకి ప్రజలు అధిక్యతను కట్టబెట్టలేదు. చండూరుమున్సిపాలిటీలో 24,995 ఓట్లు ఉంటే.. పోలైన ఓట్లలో టీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు నమోదు కావటంతో.. బీజేపీకి ఓటమిపాలు తప్పలేదంటున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఉపపోరులో రెండు మండలాల మీద కోమటిరెడ్డి పెట్టుకున్న ఆశలు ఆడియాశలు కావటమే.. వారి అంచనాలు మొత్తంగా దెబ్బ తినటానికి కారణమయ్యాయని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.