తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు మాత్రమే కాక.. రాస్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.100 కోట్ల చొప్పున కొంటూ దొరికిపోయిన వైనం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే నెలరోజులుగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలోనే నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలోనే మునుగోడులో గెలిచేదెవరు? మునుగోడులో పట్టు సాధించేది ఎవరు? మనుగోడుపై జెండా ఎగురవేసేది ఎవరు అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల పోరు పతాకస్తాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే ఓటర్లను ప్రలోభపెట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించారు. దసరా, దీపావళి పండుగను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రతీ పండుగకు మునుగోడు ఓటర్లకు తోఫా ఇచ్చి వారిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విందులు, వినోదాలు, మందు పార్టీలతో హోరెత్తించారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మునుగోడులో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈరోజుతో ప్రచారానికి తెరపడింది.
నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం నియోజకవర్గంలో ప్రచారాన్ని ఆపివేయాలని.. సోషల్ మీడియాలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు.
ఇక ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని.. సాయంత్రం తర్వాత నియోజకవర్గంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదు అని స్పష్టం చేశారు. సాయంత్రం తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాలతో నేడు సాయంత్రం 5 గంటలకు మునుగోడులో మైకులు మూగబోనున్నాయి.
చివరి రోజు కావడంతో మునుగోడు ప్రచారంతో హోరెత్తిపోతోంది. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ లు ప్రచారానికి వచ్చి రోడ్ షో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ సహా నేతలు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో నిర్వహిస్తున్న మహిళా గర్జన సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నేటితో ప్రచారానికి తెరపడడంతో ఇక అందరి దృష్టి పోలింగ్ పై నెలకొంది.
మునుగోడు పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 1192 మంది సిబ్బంది అవసరం ఉండగా.. అదనంగా 300 మందిని నియమించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.