స‌ర్‌.. ఇది దేవుడి చిత్తం.. నెక్ట్స్ ఎల‌క్ష‌న్‌కు రెడీ అయిపోండి: పాల్‌పై మునుగోడు కామెంట్స్‌

Update: 2022-11-07 06:39 GMT
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ జనానికి ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ టీఆర్ ఎస్‌, మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీలు 1000 ఓల్టుల హైటెన్ష‌న్ పుట్టిస్తే.. అంత వేడిలోనూ.. మునుగోడుకు కిత‌కిత‌లు పెట్టిన పాల్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో ఉంగరం గుర్తుతో ఆయన బరిలో దిగారు. ప్రచారం సందర్భంగా తన ఆట, పాటలు, స్పీచ్‌తో జనంతో మమేమకయ్యారు.

ఇటీవల పలు ప్రెస్‌మీట్లలో తాను మునుగోడు ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలుస్తున్నానని, తదుపరి సీఎం తానేనని, మునుగోడును అమెరికా చేస్తాన‌ని.. ల‌క్ష‌ల కోట్లు తీసుకువ‌చ్చి అభివృద్ది చేస్తాన‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసం చెప్పుకొచ్చారు.

పలుమార్లు ఈవీఎంలను మారుస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు. ఇక‌, తాజాగా జరిగిన ఓట్ల‌ కౌంటింగ్‌లో 15 రౌండ్లలో ఆయనకు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. కౌంటింగ్‌ జరుగుతున్న సందర్భంగా ఆయన కౌంటింగ్‌ కేంద్రం వద్ద మరోసారి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుట్రలకు పాల్పడ్డాయని తనకు ఇంత తక్కువగా ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ పేర్కొన్నారు.

అంతేకాదు, దీనిపై న్యాయ‌పోరాటానికి సైతం తాను దిగుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. పాల్‌కు వ‌చ్చిన ఓట్ల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిగా రియాక్ట్ అవుతున్నారు. "పాల్ స‌ర్‌.. 805 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు.. "స‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల కోసం రెడీ కండి.. అప్పుడు మీరే సీఎం" అని కొంద‌రు వ్యాఖ్యానిస్తే.. "ఇది దేవుడి చిత్తం పాల్ గారూ" అని కొంద‌రు కామెంట్లు చేశారు. మొత్తానికి కామెడీ కింగ్ పాల్ క‌థ ఇక్క‌డితో సుఖాంతం అయిపోయింది. మునుగోడు ప్ర‌జ‌ల న‌వ్వులు ఆగిపోయాయి.

నోటాకు 482 ఓట్లు ఉప ఎన్నికలో ధన ప్రభావం పెద్దగా కనిపించడంతో నోటాకు పెద్దగా ఓట్లు పడలేదు. కేవలం 482 మంది ఓటర్లు మాత్రమే నోటా బటన్‌ను నొక్కారు. ఈ 482 మందికి మాత్రమే మునుగోడు నియోజకవర్గ బరిలో ఏ ఒక్క అభ్యర్థి కూడా నచ్చకపోవడంతో వారు నోటాకు ఓటు వేశారు. అత్యధికంగా ఓటర్లు టీఆర్‌ఎస్‌, బీజేపీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ ప్రభావితం చూపలేకపోయింది. ఇక నోటాకు వేసిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News