తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం, కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
మరీ ముఖ్యంగా ఉన్న పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి.. సెగలు పొగలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా.. వ్యతిరేకత కనిపిస్తోంది. ఎవరిని కదిలించినా.. ఎందుకు రాజీనామా చేసిన్రు? అనే మాటే వినిపిస్తోంది.
ఇక, తాజాగా నియోజకవర్గంలోని చండూరు మండలంలో మరోసారి పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నేడే విడుదల.. షా సమర్పించు రూ. 18వేల కోట్లు.. కోవర్టురెడ్డి అంటూ పోస్టర్లు వెలశాయి. తెల్లారేపాటికి ఇవి భారీగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అయితే.. వీటికి కామెంట్లు కూడా వస్తున్నాయి.
కాగా, ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికిస్తుండగా బీజేపీ కార్యకర్త గమనించారు. దీంతో, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కార్లలో దుండగులు పరారైనట్టు బీజేపీ కార్యకర్త తెలిపారు. దీంతో, బీజేపీ వ్యతిరేక పోస్టర్లు ఎవరు అంటించారు అనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు.. కోమటిరెడ్డి రాజేంద్ర అనే వ్యక్తి.. పేరు తో నామినేషన్ దాఖలు కావడం.. కూడా రాజగోపాల్‌కు సెగ పెరుగుతోంది. ఇక, ఎక్కడికి వెళ్తే.. అక్కడ.. జై కొట్టాల్సిన నాయకులు.. ప్రజలకు సర్ది చెప్పుకొనే పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు ''మేమే మోసం పోయాం అని మునుగోడు ప్రజలు మీరు మోస పోవద్దు'' అని చౌటుప్పల్ పురపాలిక కార్యాలయం ప్రధాన కూడలి వద్ద పోస్టర్లు వెలిశాయి. ఈ విధంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తరవాత గోడలపై పోస్టర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపింది.
ఎన్నికల తేదీ దగ్గరపడడంతో తమను దెబ్బకొట్టడానికి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే నారాయణపురం మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు బీజేపీ తరపున ప్రచారం చేస్తుండగా ఇవాళ చౌటుప్పల్ మండలంలో ఈటెల రాజేందర్ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పోస్టర్లు అతికించడం.. గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.