త‌ప్పు త‌ప్పు.. ఆయ‌న వెంక‌న్న స్వామే - టీడీపీ ఎంపీ

Update: 2018-05-25 13:07 GMT
ఓ వైపు సోష‌ల్ మీడియా...మ‌రోవైపు సంప్రదాయ మీడియా..మ‌ధ్య‌లో విప‌క్షాలు, ఆధ్యాత్మిక‌వాదులు విరుచుకుప‌డ‌టం...వెర‌సి ఉప్పెన‌లా వ‌చ్చిన ప్ర‌తిఘ‌ట‌న, ఎదురుదాడితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుడు, టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ క‌ల‌త చెందారు. తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామి.. వెంకన్నచౌదరి అంటూ సంచ‌ల‌న‌, వివాదాస్ప‌ద‌, ఇంకా చెప్పాలంటే..హాస్యాస్ప‌ద పోలిక‌ను ప్ర‌వ‌చించిన ముర‌ళీమోహ‌న్ త‌న త‌ప్పును ఒప్పుకున్నారు.

రాజమండ్రి మినీ మహానాడులో ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ ఏపీకి మోసం చేసిన బీజేపీకి కర్నాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొంద‌రు నెటిజన్లు అయితే టీడీపీ కుల పిచ్చి - అహంకారానికి పరాకాష్ఠ అంటూ దుమ్మెత్తిపోశారు.రాజమండ్రి మహానాడులో చేసిన కామెంట్లు ర‌చ్చ‌ర‌చ్చ కావ‌డంతో ముర‌ళీమోహ‌న్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారిన మాట వాస్తవమే అన్నారు. అందుకు క్షమాపణలు చెప్పారు.అప్పటి వరకు బుచ్చయ్యచౌదరితో మాట్లాడుతూ.. ప్రసంగానికి పిలవడంతో వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని అన్నారు. ఏడుకొండల వాడంటే ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయన్నారు. నోరుజారి అన్నమాటను ఇంత పెద్ద ఇష్యూ చేస్తారని అనుకోలేదని వివరణ ఇచ్చారు. ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కాదన్నారు. పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు.  స్వామివారితో పాటు.. భక్తులు అందరికీ క్షమాపణలు చెప్పారు. తనకు అన్ని కులాలు సమానమే అని.. కుల దురభిమానం లేదని తెలిపారు. ఈరోజు ఉదయమే ఏడుకొండలవాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపు వేడుకున్నట్లు చెప్పారు.

కొస‌మెరుపు ఏంటంటే... ఆయ‌న కుల‌దుర‌భిమానం గురించి ర‌చ‌యిత చిన్నికృష్ణ ఈరోజు ఏకిప‌డేశారు. మాట్లాడ‌టం నేర్చుకోండి సారూ అంటూ క్లాస్ పీకారు.
Tags:    

Similar News