తెలుగోళ్లకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎన్టీవోడిని రాజకీయంగా.. పార్టీ పరంగా కుదిస్తే ఆయన తెలుగుదేశం పార్టీని చెందిన నేతగా తేలతారు. అయితే.. దానికి లాజిక్ అనేవి మాత్రం పెద్దగా పట్టించుకోకూడదు. ఎన్టీఆర్ పేరు తలుచుకోకుండా రోజు కూడా గడవని తెలుగుదేశం పార్టీ నేతలు.. అదే ఎన్టీవోడును పార్టీ నుంచి గెంటేసిన పాత ముచ్చట గురించి మాట్లాడితే హర్ట్ అవుతారు. అయితే.. ఆ రోజున తాము చేసిన పని గురించి విఫులంగా వివరణ ఇచ్చేసి ఇష్యూ క్లోజ్ చేస్తే.. విమర్శలకు నోరు మూత పడుతుంది. కానీ.. అలాంటి పనిని పార్టీ అధినేత చంద్రబాబు సహా.. మరే పార్టీ నేత ఎవరూ చేయలేదు.
ఇదిలా ఉంటే.. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే మహానాడును.. ఈ ఏడాది మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహానాడులో రెండో రోజైన శనివారం.. పార్టీ ఎంపీ మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానం చేసే తెలుగుదేశం నేతలకు భిన్నంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలంటూ ప్రతిపాదించారు.
తెలుగువారందరికి అభిమాన నేత అయిన ఎన్టీఆర్ పేరును.. ఆయన సొంత జిల్లా కృష్ణాకు పెట్టాలంటూ మురళీమోహన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన తెర మీదకు మురళీమోహన్ తీసుకురాగానే తెలుగుతమ్ముళ్లు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. కాకుంటే.. ఇలాంటి విషయాల్ని తొందరపాటుతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరును కడప జిల్లాకు పెట్టిన ఉదంతాన్నే చూస్తే.. కాంగ్రెస్ హయాంలో బాగానే నడిచినా.. జనస్వామ్యంలో ఎంతవరకు వెళ్లిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. వైఎస్ పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టినా.. రాజకీయంగా ఆ పేరును మార్చేందుకు జరుగుతున్న మార్పుల్ని మర్చిపోకూడదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్టీఆర్ పేరును ఆయన సొంత జిల్లాకు పెడతారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ చేతిలో నుంచి పవర్ జారిపోతే పరిస్థితి ఏమిటి? ఎన్టీఆర్ పేరును తీసేస్తే అదెంత అవమానకరంగా ఉంటుంది? మురళీమోహన్ నోటి నుంచి వచ్చిన ప్రతిపాదన వినేందుకు బాగానే ఉన్నా ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో పేరు పెట్టకపోవటమే మంచిది. చూస్తూ..చూస్తూ ఆ మహానుభావుడికి అవమానం జరగకుండా చూసుకోవాలి కదా.