మా ఇంటికొస్తే.. మాకేం తెస్తావ్.. !.. మీ ఇంటికొస్తే.. మాకేం ఇస్తావ్!! నేటి రాజకీయ నేతల నోటి చివరి మాట ఇది. సొంతలాభం కొంత మానుకోమని కొన్నాళ్ల కిందట గురజాడ వారు చెప్పి ఉండొచ్చు కానీ.. అవి రాజకీయ నాయకులకు జానేదేవ్. అడుగు తీసి అడుగు వేస్తే.. మాకేంటి? అనే కోట శ్రీనివాసరావులు పొలిటికల్ అరం గేట్రం పెరిగిపోయిన తర్వాత.. పరిస్థితి అంతా సొంత చింతన స్వసేవ!గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పార్టీలు మారడంలో పిల్లిని మించి పోయిన నాయకులు రాజకీయాలకే రాజకీయాలను నేర్పిస్తున్నారు. మీ పార్టీలోకి వస్తే.. మాకేంటి? అని వారు నేరుగా బిజినెస్ లోకి దిగిపోతున్నారు.
ఇక, నువ్వు రావడంతో పార్టీ పుంజుకోవాలి. కుదరితే అధికారంలోకి వచ్చేయాలి! అంటూ.. పార్టీలూ షరతులు విధిస్తున్నాయి. మరి అలాంటి పార్టీల్లో ఇచ్చిపుచ్చుకోడాలు సహజం. ముఖ్యంగా వివిధ కేసుల్లో తలకిందలుగా వేలాడుతున్నవారు రాజకీయ పునరావాసం ఆశ్రయించి విముక్తి మార్గంలో పయనిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం - ఇటీవలే గవర్నర్ గిరీ నుంచి తప్పుకొన్న కళ్యాణ్ సింగ్ తన అసలు పార్టీకి మాట మాత్రంగా నైనా చెప్పకుండానే బీజేపీలోకి జెంప్ చేశారు. అలా రాజ్ భవన్ నుంచి కాలు బయట పెట్టారో లేదో.. వెంటనే ఆ అడుగు కమలం పార్టీ కార్యాలయంలో పడింది.
అబ్బ! ఇదంతా తేలిగ్గా ఏమీ జరిగిపోలేదు. ఆయన తలపై బాబ్రీ మసీదు కేసు కత్తి వేలాడుతుండడమే కారణం. పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా బీజేపీకి చెందిన నాయకుడు మురళీ ధరరావు.. ఈ గోడ దూకుళ్లకు సంబంధించి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసుల నుంచి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవ్వరూ పెట్టుకోవద్దనీ - అలాంటి ఆశతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అది వృథా ప్రయాసే అవుతుందన్నారు. ఆదాయ పన్ను శాఖ దాడులకు - ఈడీ చేసే దాడులకూ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదనీ - ఎవరిపని వారిదేననీ - చట్టం తన పనితాను చేసుకెళ్తుంటే మధ్యలో తాము ఎన్నడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
కర్ణాటకలో తాను పార్టీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్నాననీ, అక్కడ బీజేపీ నాయకులపై జరిగిన ఐటీ దాడులు చూస్తే పార్టీ వ్యవహార శైలి ఎంత నిక్కచ్చిగా ఉంటుందో అర్థమౌతోందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఊరికేనే తూతూ. మంత్రంగా విమర్శలను తప్పికొట్టడంలో భాగమేనని ఏపీలోనే కాకుండా ఎక్కడ చూసినా.. బీజేపీ గోడదూకుళ్లను ప్రోత్సహించడం - ఆ వెంటనే చేరుతున్న వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చూసీ చూడనట్టు వ్యవహరించడం వంటివి కామన్ గా జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.