సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. కలకలం రేపుతున్న ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి హత్యకు భారీఎత్తున కుట్ర జరుగుతుందన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే.. రాష్ట్ర విద్యుత్.. ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. ఆయన్ను హతమార్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక వాహనంలో మంత్రి స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. డ్రోన్ తో గ్రామ వీధులు.. డొండ రోడ్లను చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. రెక్కీను ప్రగతి నివేదన సభ జరిగిన రోజున అని కొందరు చెబుతుంటే.. కాదు.. ఆగస్టు 30న అని మరికొందరు పేర్కొంటున్నారు.
ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు నాగారం వచ్చిన జగదీశ్ రెడ్డి ఎలాంటి సెక్యురిటీ లేకుండా రావటం గమనార్హం. అంతేకాదు.. తన సొంతూరు వచ్చినప్పుడు తానున్న పదవి దర్పాన్ని ప్రదర్శించకుండా అందరిలోనూ కలిసిపోవటం ఆయనకు అలవాటు. సన్నిహితుల ఇళ్లకు.. తెలిసిన వారి పొలాలకు వెళ్లి.. వారితో మాట్లాడటం.. కలుపుగోలుగా వ్యవహరించటం చేస్తుంటారు.
దీన్ని ఆసరా చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ప్రత్యర్థులు ఉన్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరూ పెద్దగా దృష్టి పెట్టని సమయంలో దాడి చేయాలన్న ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల కిందట ఆయన సూర్యాపేట నుంచి వస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్ లోకి ఒక వ్యాన్ దూసుకొచ్చి.. ప్రోటోకాల్ వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం ఆ వాహనం కనిపించకుండా పోవటంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ..జగదీశ్ రెడ్డిని హతమార్చాలన్న కుట్ర ఎవరిది? వారికి అంత అవసరం ఎందుకు వచ్చింది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తాజా మాజీ మంత్రి హత్యకు రెక్కీ నిర్వహించినట్లుగా తమ వద్ద సమాచారం ఉందన్న మాటను సూర్యాపేట జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు చెబుతున్నారు.