28 ఏళ్లుగా పరారీ.. హత్యకేసు నిందితుడు ఇన్నేళ్లకు చిక్కాడిలా..

Update: 2022-12-31 02:30 GMT
చేసిన పాపం ఊరికే పోదు.. అది ఎక్కడున్నా మెడకు చుట్టుకుంటుంది. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం చేసిన హత్య అదీ. అంతా మరిచిపోయారు. ఇక తప్పించుకున్నానని భావించిన నిందితుడు దర్జాగా బతకడం ప్రారంభించాడు. కానీ పోలీసులు వదలలేదు. అతడిని 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు కటకటాలకు పంపారు. నిఘాలో ఉంచి మరీ పట్టుకొని అరెస్ట్ చేశారు. సినిమాల్లో మాదిరిగా పట్టుకున్న ఈ స్టోరీ ఆసక్తి గొలిపేదే.

28 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హత్య కేసులో నిందితుడిని పొరుగున ఉన్న ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.  1994 నవంబర్ లో కాషిర్మీరాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాగ్రణీదేవి ప్రజాపతి (27) , ఆమె నలుగురు పిల్లలను మూడు నెలల నుండి ఐదేళ్ల వయస్సు గల వారిని ఇంట్లో ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు నాడు కేసు నమోదైంది. అప్పటి నుంచి వీరు తప్పించుకు తిరుగుతున్నారు. నిందితుల జాడ కోసం పోలీసులు వెతికినా ఇప్పటికీ దొరకలేదు.  అయితే వారంతా దేశం దాటి వెళ్లిపోయారు.

ఖతార్‌లో ప్రధాన నిందితుడు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో ఒకరి గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. గురువారం ముంబైలో ఖాతార్ నుంచి దిగగానే పోలీసులు అతన్ని విమానాశ్రయ అధికారుల సహాయంతో పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇన్నేళ్లకు ప్రధాన నిందితుడు దొరకడంతో మిగతా వారీ కోసం ఆరాతీస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News