ఇక‌పై ముష‌ర్ర‌ఫ్ పాకిస్థానీ కాదు!

Update: 2018-06-09 07:38 GMT
త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు దాయాది దేశంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న పాక్ మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ పై ఆయ‌న మాజీ భార్య రేహ‌మ్ ఖాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం విదిత‌మే. అదే త‌ర‌హాలో మ‌రోసారి పాక్ ప్రధాని పీఠాన్ని అధిష్టించాల‌ని క‌ల‌లుగంటోన్న మాజీ అధ్యక్షుడు ముష‌ర్ర‌ఫ్ కు దిమ్మ‌దిరిగిపోయే షాక్ త‌గిలింది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం ముష‌ర్ర‌ఫ్ పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ పాక్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌ధాని నసీర్‌ ఉల్‌ ముల్క్‌ ప్రకటించారు. నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ పాస్‌పోర్టు డైరెక్టోరేట్‌ కార్యాలయాలు కూడా ముష‌ర్ర‌ఫ్ పౌర‌స‌త్వ ర‌ద్దు నిర్ణ‌యాన్ని ధృవీక‌రించాయి. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్న ముష‌ర్ర‌ఫ్ కు ఈ నిర్ణ‌యంతో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఎన్నిక‌ల్లో పోటీ చేసే సంగ‌తి ప‌క్క‌న‌బెడితే....ప్ర‌స్తుతం ఆయ‌న దుబాయ్ నుంచి పాక్ కు రావ‌డంపై సందిగ్ధ‌త ఏర్ప‌డింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ముష‌ర్ర‌ఫ్ జాతీయత గుర్తింపును రద్దు చేశామ‌ని పాక్  స‌ర్కార్ తెలిపింది. ఈ నిర్ణ‌యంతో ముష‌ర్ర‌ఫ్ పాస్‌పోర్టు ర‌ద్ద‌యింది. ముషర్రఫ్‌ ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టేందుకు కోర్టు ఈ చ‌ర్య‌లు తీసుకుంది. దీంతో, ముష‌ర్ర‌ఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవ‌కాశం కూడా లేకుండా పోయింది. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్న ముష‌ర్ర‌ఫ్ పాస్ పోర్టు ర‌ద్ద‌వ‌డంతో చిక్కుల్లో ప‌డ్డారు. త్వ‌ర‌లో పాక్ కు రావాల‌నుకుంటున్న ముష‌ర్ర‌ఫ్ కు ఈ నిర్ణ‌యం ఇబ్బందిక‌రంగా మారింది. అయితే, ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న ముష‌ర్ర‌ఫ్ ను సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం పాక్ కు రప్పించేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక ప‌త్రాల‌ ద్వారా ముష‌ర్ర‌ఫ్ ను పాక్ కు రప్పించనున్నారు. ముషర్రఫ్‌ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు సిద్ధ‌మ‌ని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, గ‌తంలో ముష‌ర్ర‌ఫ్ పై పలు కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. 2007లో పాక్ లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భంధం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, వంటి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ముషర్రఫ్ పై ‘దేశ ద్రోహం’ కేసు న‌మోదైంది. ఆ త‌ర్వాత 2016లో వైద్యం కోసం దుబాయ్‌ వెళ్లిన ముషర్రఫ్ ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు.

Tags:    

Similar News