మోడీని పొగిడేసి.. శిష్యుడ్ని తిట్టేశాడు

Update: 2017-04-24 04:24 GMT
మేజిక్‌ కు ప‌ర్యాయ‌ప‌దంగా ప్ర‌ధాని మోడీ మారుతున్నార‌న‌టంలోసందేహం లేదు. శ‌త్రువుకు సైతం ఆయ‌న‌లో మంచి ల‌క్ష‌ణాలే త‌ప్పించి.. త‌ప్పులే క‌నిపించ‌టం లేదు. అదే స‌మ‌యంలో.. ఆయ‌న‌లో క‌నిపించ‌ని చెడు.. ఆయ‌న నేతృత్వం వ‌హించే పార్టీలోనూ.. ఆయ‌న ప‌రివారంలోనూ క‌నిపిస్తుండ‌టం విశేషం. భార‌త్‌ ను.. భార‌త్ నాయ‌క‌త్వాన్ని పొగిడే కార్య‌క్ర‌మాన్ని అస్స‌లు పెట్టుకోని దాయాదికి చెందిన ప్ర‌ముఖ నేత‌లు సైతం.. మోడీ పాల‌న‌ను మెచ్చుకోవ‌టం క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో అధికార పార్టీ అయిన బీజేపీ మీద మాత్రం నింద‌లు ప‌డుతున్నాయి.

పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. తాజాగా ఆయ‌న మోడీని తెగ పొగిడేశారు. పొగ‌డ్త‌లు మోడీకి కొత్తేం కాదు. కానీ.. ముషార‌ఫ్ర్ లాంటి నేత సైతం పొగ‌డ‌టం.. ఆయ‌న పాల‌నకు కితాబు ఇవ్వటం క‌చ్ఛితంగా ప‌ట్టించుకోవాల్సిన అంశ‌మే. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు చూస్తే.. మోడీ చాతుర్యం ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

భార‌త్‌ లో ప‌వ‌ర్లో ఉన్న బీజేపీ మ‌త‌తత్వ పార్టీ అని.. అయితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం చురుగ్గా ప‌ని చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో భార‌త‌దేశం పురోగ‌తి సాధిస్తుంద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. పాల‌న విష‌యంలో ప్ర‌త్య‌ర్థి ప్ర‌శంస‌లు పొందిన మోడీ.. పాక్ త‌ర‌చూ ప్ర‌స్తావించే క‌శ్మీర్ విష‌యంలో మాత్రం అసంతృప్తికి గురి చేస్తున్న వైనాన్ని చెప్పుకొచ్చారు. క‌శ్మీర్ విష‌యంలో మోడీ శాంతిని కోరుకోవ‌టం లేద‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో మోడీ టీం పైనా పాక్ మాజీ అధ్య‌క్షుల వారు త‌ప్పు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం.

త‌న పాల‌న‌తో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటున్న యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ను ముషార‌ఫ్ర్ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న యోగ్య‌త ఏమిట‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. భార‌త్ లో లౌకిక విశ్వాసాలు క్షీణిస్తున్నాయ‌ని.. భార‌త్ తో పోలిస్తే.. పాకిస్థాన్ పురోగ‌మించిన‌.. వివేకం క‌లిగిన స‌మాజంగా ఆయ‌న అభివ‌ర్ణించ‌టం గ‌మనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News