సంచలనం: హిజాబ్ పై న్యాయపోరాటానికి సిద్ధమైన ముస్లిం బోర్డు

Update: 2022-02-18 15:30 GMT
హిజాబ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అందరి నోట ప్రతిధ్వనిస్తోంది. ముస్లిం మహిళలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ మేరకు సంచలన పిలుపునిచ్చింది. ముస్లిం ఎవరూ ధర్నాలు నిరసనలు చేయకూడదు అని న్యాయపరంగా పోరాడుదామని హామీ ఇచ్చింది.

కర్ణాటక కోర్టులో పోరాడుతున్న వ్యక్తులకు మద్దతుగా నిలబడదామంటూ పిలుపునిచ్చింది. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళదామంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బోర్డు అనుమతి లేకుండా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ ధర్నాలో నిరసనలో మీడియా డిబెట్స్ లో వెళ్లకూడదని సూచించింది.

కర్ణాటకలో హిజాబ్ వివాదం దుమారం ఇంకా రేగుతూనే ఉంది. అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విడుదల చేసిన ప్రకటనతో గొడవలు తగ్గే అవకాశం ఉంది. విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన డ్రెస్సులకు అనుమతి లేదని తేల్చిచెప్పింది కర్ణాటక ప్రభుత్వం.

అయినా సరే విద్యార్థులు హిజాబ్ తమకు రాజ్యాంగం కల్పించిన హక్కంటూ నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ ధరించిన విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం అడ్డుకోవడంతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఎడతెగని వాదనలు జరుగుతున్నాయి. కనీసం శుక్రవారం రోజైనా హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

 ప్రభుత్వం నుంచి తనకు ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉందని.. వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు.. 
Tags:    

Similar News