పాకిస్థాన్ లో ఒక యవ్వారం ఇప్పుడు పెద్ద సంచనలంగా మారింది.ఒక మతాధికారితో ఒక మోడల్ దిగిన సెల్ఫీ తీవ్ర వివాదానికి కారణం కావటమే.. సదరు మతాధికారి పదవి ఊడిపోవటం తెలిసిందే. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. పాక్ మోడల్ కాందీల్ బాలోచ్.. పాక్ మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావిని ఇఫ్తార్ విందుకు ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిచింది. అక్కడ మత విషయాలు నేర్చుకుంటానని చెప్పి.. ఆహ్వానించటంతో తాను వెళ్లినట్లుగా ఖావి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆయన ఫోన్ మాట్లాడుతున్న వేళ.. ఆయన ధరించిన టోపీని తాను పెట్టుకొని ఆయనతోకలిసి సెల్ఫీలు దిగిన బాలోచ్.. వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో ఇదో వివాదంగా మారింది. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ఒక మతాధికారి ఇలాంటి పనులు చేయటం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. ఆయన్ను మతాధికారి పదవి నుంచి తీసి పారేశారు. ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తే వెళ్లాలని.. అంతకు మించి మరేదీ తనకు సంబంధం లేదని ఖావి చెబుతుంటే.. ఆయన తనకు ప్రపోజ్ చేశారంటూ బాలోజ్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లైంది. మోడలమ్మతో మతాధికారి యవ్వారం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. ఈ ప్రశ్నలకు మోడలమ్మ ఏం బదులిస్తుందో..?