ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఈ మద్యన చోటు చేసుకున్న ఉగ్రవాదుల నరమేధంతో 129 మంది అమాయకులు మరణించటం తెలిసిందే. ఈ ఘోర కలి తర్వాత.. ఫ్యాన్స్ లోని ముస్లింలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావటం తెలిసిందే. కొందరు.. అమాయక భారతీయ సిక్కుల్ని సైతం ముస్లింలుగా భావించి ద్వేషిస్తున్న వైనం వార్తలుగా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ఫ్రాన్స్ లో ముస్లింల పట్ల పెద్దగా లేని వ్యతిరేకత.. తాజా ఉగ్రవాద దాడుల నేపథ్యంలో చోటు చేసుకోవటం ఒక ముస్లిం యువకుడి మనసును తీవ్రంగా కలిచివేసింది. తన తప్పు ఏమీ లేకున్నా.. కొందరు ముస్లిం ఉగ్రవాదుల కారణంగా.. ఫ్రెంచ్ పౌరులు.. ముస్లింల పట్ల అనుమానంగా.. సందేహంగా చూడటం ఆ యువకుడ్ని కలిచి వేసింది. తాజాగా ఆ కుర్రాడు ఒక వినూత్న ప్రయత్నం చేశాడు. ప్యారిస్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు జరిపేందుకు ప్రజలు వస్తున్న చోట ఆ ముస్లిం యువకుడు కళ్లకు గంతలు కట్టుకొని.. చేతిలో ఒక ప్లకార్డు పట్టుకొని.. తాను ముస్లింనని.. తనను అందరూ టెర్రరిస్ట్ అని అంటున్నారంటూ.. ‘‘మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మితే నా వద్దకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’’ అంటూ కూడలి వద్ద నిలబడ్డాడు.
ఉగ్రదాడికి చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన చిన్నా పెద్దా అంతా.. ఆ ప్లకార్డును చూసిన ప్యారిస్ పౌరులు పెద్ద ఎత్తున అతన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తన కళ్లకు కట్టిన గంతల్ని విప్పి.. అందరికి థ్యాంక్స్ చెప్పిన ఆ కుర్రాడు.. తాను అలా అడిగినందుకు క్షమించాలని కోరాడు. తాను ముస్లిం అయినప్పటికీ తాను టెర్రరిస్ట్ ను కానని.. తాను ఎవరినీ చంపలేదని పేర్కొన్నారు. చంపటానికి ఇస్లాం వ్యతిరేకమని.. ముస్లిం అనేవాడు ఎవరినీ చంపడని పేర్కొన్నారు. ఒక సందేశం ఇచ్చేందుకే తాను అలా ప్లకార్డు పట్టుకొని ఆలింగనం చేసుకోవాలని కోరినట్లుగా వివరణ ఇచ్చాడు.
ఉగ్రవాదులు ప్యారిస్ నగరం మీద విరుచుకుపడిన రోజు తన పుట్టినరోజు అని.. కానీ.. తాను ఆ వేడుకను చేసుకోలేదని.. బయటకు కూడా రాలేదని.. మరణించిన వారికి.. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముస్లింలంతా టెర్రరిస్ట్ లు కాదని సదరు యువకుడు సందేశమిచ్చే ప్రయత్నం చేస్తే.. ముస్లిం అందరినీ తాము వ్యతిరేకించటం లేదని.. తమకు అన్యాయం జరిగినా వారి పట్ల తాము ముస్లింల మీద అగ్రహంగా లేమన్న విషయాన్ని.. ఆ కుర్రాడ్ని ఆలింగనం చేసుకోవటం ద్వారా ప్యారిస్ ప్రజలు ప్రపంచానికి సందేశం ఇవ్వటం విశేషం.